Begin typing your search above and press return to search.
రచ్చగా మారిన ట్వీట్లు..అకౌంటే లేదు తమ్మారెడ్డి
By: Tupaki Desk | 22 March 2018 11:33 AM GMTసినీ పరిశ్రమపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడం, దీనికి సినీ ప్రముఖుడు తమ్మారెడ్డి భరద్వాజా ఏకంగా సంచలన ఎదురుదాడి చేసినట్లుగా వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలింది. తనపేరుతో జరుగుతున్న ప్రచారంలో అసలు నిజం లేదని ఆయనే స్వయంగా మీడియాకు వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణకు ముందు తమ్మారెడ్డి పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్వీట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
`పవన్ కళ్యాణ్ గారు మీ టీడీపీ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఎదుర్కొనే ధైర్యం లేక సమస్యను పక్కదారి పట్టించాలని తెలుగు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారా ??? రాజేంద్ర ప్రసాద్ గారు`` అంటూ తమ్మారెడ్డి భరద్వాజ పేరుతో ట్విట్టర్ అకౌంట్లో వైరల్ ప్రచారం జరిగింది. అంతేకాకుండా గతంలో ప్రత్యేక హోదాపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన వీడియోను పోస్ట్ చేస్తూ `రాజేంద్ర ప్రసాద్ గారు,,,, దీనిపై స్పందించి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ పై నింద మోపి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. మన బంగారం మంచిది కానప్పుడు పక్క వారిని అని కూడా ప్రయోజనం ఉండదు` అంటూ ఎద్దేవా చేశారు. `మా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది పవన్ కళ్యాణ్‌తో కలిసి పోరాడానికి సిద్ధంగా ఉన్నారు కానీ మీ టీడీపీతో కలిసి పోరాటం చేయడానికి కేవలం ఓ 10 మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు మిగిలిన వారు మీ పార్టీ మునిగి పోయే నావ అంటున్నారు!`అంటూ టీడీపీపై పోస్ట్ చేసిన సంచలన ట్వీట్ వైరల్ అయింది. ఈ నేపథ్ంయలోమీడియా ముందుకు వచ్చిన తమ్మారెడ్డి అసలు తనకు ట్విట్టర్ అకౌంటే లేదని వివరణ ఇచ్చారు.