Begin typing your search above and press return to search.
విడిపోయి కొట్టుకోండి.. అప్పుడు నమ్ముతాం
By: Tupaki Desk | 16 Feb 2018 5:13 PM GMTరాష్ట్ర విభజన సమయంలో ‘విడిపోయి కలిసుందాం’ అనే నినాదం ఒకటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తాజాగా.. అలాంటిదే మరో నినాదం ఒకటి వినిపించారు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆయన టీడీపీ, బీజేపీల తీరుపై మండిపడ్డారు. మిత్రపక్షాలుగా ఉంటూ నాటకాలాడొద్దని.. కావాలంటే విడిపోయి కొట్టుకోవాలని సూచించారు.
ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు అనడం - నిధులిచ్చామని బీజేపీ నేతలు చెబుతుండటంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆరు నెలల క్రితం వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై ఈగ వాలనివ్వని టీడీపీ నేతలు ప్రస్తుతం దుమ్మెత్తిపోస్తున్నారని, టీడీపీ నేతలు, బీజేపీ నేతల పరస్పర ఆరోపణలు - విమర్శలతో ప్రజలు అయోమయంలో పడిపోయారని అన్నారు. ‘ప్రజలను తికమకపెట్టొద్దు. విడిపోయి కొట్టుకోండి. రెండు ప్రభుత్వాల్లో మీరే ఉంటారు..ఒకరినొకరు తిట్టుకుంటారు! టీవీ ఛానెల్స్ లో అల్లరి చేస్తారు! పేపర్లలో అల్లరి చేస్తారు! జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారా? లేకపోతే - జనం పిచ్చోళ్లని అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో ముందు తేల్చండి! నిజానిజాలు చెప్పండి! అదే నా కోరిక’ అని తమ్మారెడ్డి ఏకిపడేశారు.
రాజకీయంగా ఇప్పటికే టీడీపీ - బీజేపీ తీరుపై రెండు పార్టీల నేతలను అంతా విమర్శిస్తున్నారు. కేంద్రంలో టీడీపీ కొనసాగుతూ.. రాష్ట్రంలో బీజేపీ కొనసాగుతూ ఇలా ఉత్తుత్తి నిరసనలు చేస్తున్నారంటూ సాధారణ ప్రజలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ రంగానికి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ కూడా తన అభిప్రాయం చెప్పడంతో మరింత మంది ప్రస్తుత రాజకీయ పరిణామాలపై స్పందించే సూచనలు కనిపిస్తున్నాయి.