Begin typing your search above and press return to search.
నేనైతే అలా చేయను.. వెంకయ్యపై తమ్మినేని సంచలనం
By: Tupaki Desk | 4 Aug 2019 10:46 AM GMTఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని ఆకట్టుకున్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం రాజీపడే మనస్తత్వం తనది కాదని నిరూపించారు. ఆదివారం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజ్యసభలో టీడీపీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలో విలీనం చేయడం సరైంది కాదని.. ఈ విషయంలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీరును తమ్మినేని తప్పుపట్టారు. నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేయడానికి వెంకయ్యనాయుడు ఆమోదించడం తప్పు అని స్పష్టం చేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న వెంకయ్యలాంటి వారు ఇలా ప్రవర్తించడం సరైందికాదని ఏకిపారేశారు. ఫిరాయింపుల సమస్య ఏపీలో గనుక చోటు చేసుకుంటే నిర్మోహమాటంగా వేటు వేస్తానని తమ్మినేని సీతారాం ప్రకటించడం సంచలనంగా మారింది.
తాను ఏపీ స్పీకర్ గా ఉన్నంత కాలం ఫిరాయింపులను ప్రోత్సహించనని.. వెంకయ్యనాయుడిలా తాను ఎప్పుడూ ప్రవర్తించనని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలీ ఎన్నికలు వస్తే తాము ఏం చేయలేమని.. అంతా కేంద్రంలో ఏలిన వారి దయే అని అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలను శ్రీశైలం తరలింపు అనేది అంతరాష్ట్ర సమస్య అని రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాకే నీటిని మళ్లిస్తారని తమ్మినేని స్పష్టం చేశారు.