Begin typing your search above and press return to search.

ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం..

By:  Tupaki Desk   |   13 Jun 2019 6:05 AM GMT
ఏపీ స్పీకర్ గా తమ్మినేని సీతారాం..
X
ఏపీ శాసనసభ స్పీకర్ గా తమ్మినేని సీతారాం గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త సభాపతిగా ఎన్నికైన తమ్మినేనికి సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు స్పీకర్ చైర్ లో కూర్చుండబెట్టారు.

*తమ్మినేని సీతారాం చరిత్ర ఇదే...

ఏపీ స్పీకర్ గా ఎన్నికైన తమ్మినేని సీతారాం రాజకీయాల్లో తలపండిన నేత.. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఉత్తరాంధ్రలోని అణగారిన బీసీ వర్గానికి చెందిన వారు. పైగా వెనుకబడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొమ్మిదేళ్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. సీనియర్ నేత కావడంతో తమ్మినేనిని ఏరికోరి జగన్ స్పీకర్ ను చేశారు.

ఒకప్పుడు సీతారాం టీడీపీ నేతనే.. ఎర్రన్నాయుడితో పాటు తమ్మినేని టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. టీడీపీ ఆవిర్భావం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ - చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశారు. న్యాయశాఖతోపాటు అనేక కీలకశాఖలను పర్యవేక్షించారు.

టీడీపీలో ఎర్రంనాయుడు ఆధిపత్యం - విభేదాలు అసంతృప్తి కారణంగా ఆయన చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో తమ్మినేని ప్రజారాజ్యం పార్టీ తరుఫున ఆముదాలవలసలో నిలబడ్డారు. ఈయనపై టీడీపీ ఆయన బామ్మర్ధి రవికుమార్ ను నిలిపింది. ఆ ఎన్నికల్లో తమ్మినేని ఓడిపోయాడు.

2013లో వైసీపీ లో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు స్పీకర్ గా ఎన్నికయ్యారు.