Begin typing your search above and press return to search.

ఆంధ్రప్రదేశ్ రాజధాని రగడ.. మీడియా సంస్థ కథనంపై స్పీకర్ అభ్యంతరం

By:  Tupaki Desk   |   20 Jan 2020 4:07 PM GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని రగడ.. మీడియా సంస్థ కథనంపై స్పీకర్ అభ్యంతరం
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని తరలింపు రగడ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర రాజధానిని విశాఖకు తరలిస్తున్న నేపథ్యంలో.. ఈ ఇష్యూపై పలు నివేదికలు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా ఆ ప్రాంతానికి మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందంటూ అమెరికా రూపొందించిన నివేదికలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రత్యేకంగా ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతి ఫోకస్ పెట్టి ప్రచురించింది.

భారతదేశం మొత్తానికి మావోయిస్టుల ముప్పు పొంచి ఉందని, అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకించి వెలకట్టలేని ఖనిజ నిక్షేపాలున్న అటవీ ప్రాంతాలున్నచోట వారి బలం చాలా ఎక్కువగా ఉందని.. మైనింగ్‌ జరిపేందుకు ప్రభుత్వాలు, అడ్డుకునేందుకు గిరిజనులు, మావోయిస్టులు నిరంతర యుద్ధం చేస్తున్నారని దీని ప్రభావం ఏపీలోనూ ఉందని అమెరికా తన అంతర్జాతీయ నివేదికల్లో వెల్లడించింది.

అయితే నేడు (జనవరి 20) జరిగిన బీఏసీ సమావేశంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఫోకస్ పెట్టిన ఈ కథనంపై స్పీకర్ తమ్మినేని సీతారాం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో భాగంగా ఏడాది క్రితం విశాఖలో ఎమ్మెల్యేను నక్సల్స్‌ చంపలేదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో హోంమంత్రిని చంపలేదా? అని మంత్రి కన్నబాబు తిరిగి ప్రశ్నించారు. విశాఖను రాజధానిగా అంగీకరించాలని అచ్చెన్నను స్పీకర్‌ కోరారు. గతంలో స్పీకర్లు - మంత్రులు ఉన్నా.. ఉత్తరాంధ్ర ఎందుకు అభివృద్ధి చెందలేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించడంతో ఆయన అలానే మాట్లాడతారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.