Begin typing your search above and press return to search.
స్పీకర్ సార్.. సహనం కోల్పోతున్నారా?
By: Tupaki Desk | 23 Sep 2020 3:30 PM GMTరాజకీయాల్లో విమర్శలు.. ప్రతి విమర్శలు కామనే! ప్రత్యర్థిపార్టీలపైనా.. ఎదురవుతున్న ప్రతిబంధకాలపైనా ఒకింత ఆగ్రహం.. ఆవేశం.. ఆక్రోశం.. నాయకులకు సహజమే. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులకు ఈ తరహా ఆవేశం ఉండాల్సిందే! కానీ, రాజ్యాంగ బద్ధమైన స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం కూడా సాధారణ నాయకుడిగా మారిపోయి.. కామెంట్లు కుమ్మరించడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని, తన మేనల్లుడినే తనపై పావుగా వాడుకున్న చంద్రబాబుపై ఆయనకు పీకల్లోతు కోపం ఉందని అందరికీ తెలిసిందే.
ఈ కారణంగానే ఆయన పార్టీని వీడి ప్రజారాజ్యం, తదుపరి వైసీపీలో చేరిన విషయం కొత్తేమీకాదు. అయితే, రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇప్పుడు అవకాశం వచ్చిందన్న కారణంగా తన స్థాయి ఏమిటీ కూడా గుర్తించకుండా వ్యాఖ్యలు చేయడాన్ని రాజకీయ మేధావులు, రాజ్యాంగ మేధావులు కూడా హర్షించడం లేదు. కొన్నాళ్లుగా స్పీకర్ తమ్మినేని చేస్తున్న వ్యాఖ్యలపై విశ్లేషణలు వస్తున్నాయి. వాస్తవానికి స్పీకర్‌కు రాజకీయాలు ఆపాదించరాదనేది రాజ్యాంగం చెబుతున్న మాట. అదేసమయంలో స్పీకర్ స్థానంలో ఉన్న నాయకులు ఎవరైనా.. రాజకీయ వివాదాలకు, విమర్శలకు కూడా దూరంగా ఉండాలనే చెబుతోంది. కానీ, ఈ సునిశితమైన లక్ష్మణ రేఖ కొన్నాళ్లుగా వివాదాలకు దారితీస్తోంది.
అడపాదడపా.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తమ్మినేని సీతారాం చేస్తున్న విమర్శలు.. ఆయన చుట్టూ ప్రతివిమర్శలకు దారితీస్తున్నాయి. అమరావతి విషయంలో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఎటు చూసినా.. ఎడారే కనిపిస్తోందని.. అలాంటి చోట రాజధాని ఎందుకని ప్రశ్నించి.. నలువైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు.. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌కు సంబంధించిన ఏసీబీ కేసులో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల విషయంలోనూ స్పీకర్ జోక్యం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను.. ఎఫ్ ఐఆర్ వివరాలను మీడియాలోను... సోషల్ మీడియాలోనూ రాకుండా చూడాలనడంపై ఆయన ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
``సీబీఐ విచారణ వద్దని, ఎఫ్ఐఆర్ కూడా పత్రికలో వేయవద్దని చెబుతున్నారు. ఏదో ఒక రోజు ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమిస్తారు. సీఎం జగన్ మౌనం వహించారు. ఈ మౌనం బద్దలైతే ప్రళయం తప్పదు. స్టేలపై ఉన్న చంద్రబాబును ఏ క్షణంలో మూసేస్తారో తెలియదు. చంద్రబాబుకు దమ్ముంటే స్టేలు వెకేట్ చేయించుకోవాలి`` అనివ్యాఖ్యానించారు సీతారాం. వాస్తవానికి ఇలాంటి వ్యాఖ్యలు సాధారణ నాయకుడో.. మంత్రో అంటే.. రాజకీయంగా ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, రాజ్యాంగ బద్ధమైన పొజిషన్‌లో ఉండి.. రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థగా ఉన్న న్యాయస్థానాలపై పరోక్షంగావ్యాఖ్యాలు చేయడం మాత్రం సీతారాంకు తగదనే సూచనలు వస్తున్నాయి. సార్.. స్పీకర్‌గారూ.. సంయమనం పాటించాలి!! అని చెప్పించుకునే పరిస్థితి వస్తోంది. ఇది ఆయన సీనియార్టీకే మంచిది కాదని అనేవారు కూడా ఉన్నారు. మరి స్పీకర్ సార్ వినిపించుకుంటారో. లేదో చూడాలి.