Begin typing your search above and press return to search.
బాబునూ... సైకో అనేశారే!
By: Tupaki Desk | 24 Nov 2017 9:32 AM GMTతమ్మినేని సీతారాం గుర్తున్నారా? ఎందుకు గుర్తు లేరు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ప్రస్తుత ఏపీ సీఎం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబు కేబినెట్ లో ఓ కీలక శాఖ మంత్రిగా పనిచేసిన తమ్మినేని సీతారాం అందరికీ చిరపరచితులే. నాడు బాబు కేబినెట్ లో ఓ వెలుగు వెలిగిన తమ్మినేని... ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి జంపయ్యారు. టీడీపీతోనే రాజకీయ ఓనమాలు దిద్దుకున్న తమ్మినేని... ఉత్తరాంధ్ర రాజకీయాల్లో పేరుగాంచిన నేతగానే ఎదిగారు. 2009 ఎన్నికల్లో చిరు పార్టీ బోల్తా కొట్టడం, ఆ తర్వాత చిరు ఆ పార్టీని ఏకంగా కాంగ్రెస్‌లో కలిపేయడంతో తమ్మినేని లాంటి సీనియర్లు ఎవరి దారి వారు చూసుకున్నారు. కడప జిల్లాకు చెందిన సి.రామచంద్రయ్య లాంటి వారు మళ్లీ టీడీపీలోకి ఎందుకులే అనుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే... తమ్మినేని మాత్రం కొంతకాలం పాటు సైలెంట్‌గానే ఉండిపోయి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరిపోయారు.
రాజకీయాల్లో సీనియారిటీ ఉన్న తమ్మినేనికి జగన్ బాగానే ప్రాధాన్యమిస్తున్నారట. ఈ క్రమంలో పార్టీ అభివృద్దికి ఏమేం చేయాలన్న కోణంలో పార్టీ అధిష్ఠానానికి తమ్మినేని చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయినా ఇప్పుడు తమ్మినేని గురించిన ప్రస్తావన ఎందుకన్న విషయానికి వస్తే... తాను గతంలో ఉన్న పార్టీకి అధినేతగా, ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడిపై ఆయన అంతెత్తున ఫైరైపోయారు. చంద్రబాబును ఏకంగా సైకో అని, సైకో ఫ్లవర్ అని, అలాంటి చంద్రబాబుకు బాడీ నిండా విషమేనని తమ్మినేని ఓ రేంజిలో ఫైరయ్యారు. తన సొంత జిల్లా శ్రీకాకుళంలో శుక్రవారం మీడియా ముందుకు వచ్చిన తమ్మినేని... చంద్రబాబుపై ఉరుము లేని పిడుగులా ఫైరైపోయారు.
* చంద్రబాబు ఓ సైకో ఫ్లవర్, సైకో ఫ్లవర్‌ను ముట్టుకుంటే విషం చిమ్ముతుంది. ఆయన వద్దకు చేరినా అంతే....చంద్రబాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే. నీతివంతమైన, ప్రజాస్వామ్య రాజకీయాలు ఎప్పుడైనా చేశారా?. ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను రాజీనామా చేయించి, పార్టీలో చేర్చుకోవడం వైఎస్ జగన్ నీతి అయితే,... ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుక్కొని వారిని కేబినెట్‌లోకి చేర్చుకోవడం చంద్రబాబు నైజం. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా మాట్లాడాలి. గత చరిత్రను గుర‍్తించి నీతి కోసం మాట్లాడాలి. ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, మళ్లీ అదే ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని టీడీపీలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుది. ఇక తన రాజకీయ గురువైన అమర్నాథ్‌రెడ్డిని మోసం చేసి, ఆయన కొడుకు కిరణ్ కుమార్ రెడ్డిని పొగడటం ఏమీ రాజకీయం. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో నల్లారి సోదరుల పాత్ర ఉందని ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు వారినే పార్టీలో చేర్చుకున్నారంటే ...ఆయన నీతి ఏపాటిదో అర్థం అవుతోంది. 2019లో చంద్రబాబుకు కటకటాలు తప్పవు. జగన్ ప్రభంజనాన్ని చంద్రబాబు అడ్డుకోలేరు* అని తమ్మినేని తనదైన శైలిలో ఊగిపోయారు.