Begin typing your search above and press return to search.
అలాంటి సీఎం కేసీఆర్ ఒక్కరేనట!!
By: Tupaki Desk | 25 Nov 2016 7:50 AM GMTతెలంగాణలో సామాజిక న్యాయం - రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సీపీఎం రాష్ట్రకమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు దాటింది. గతనెల 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన మహాజన పాదయాత్ర మెదక్ జిల్లాలో ఈ ప్రత్యేకతను సాధించుకుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సొంత జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా పాదయాత్రకు సారథ్యం వహిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సీఎం తీరుపై మండిపడ్డారు. దేశంలోకెల్లా ప్రజలను కలిసే అలవాటు లేని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని విమర్శించారు. అసలు ప్రజలతో సంబంధాలే లేని సీఎం అధికారిక నివాసానికి 'ప్రగతి భవన్' అని, సందర్శకుల గదికి 'ప్రజాహిత ప్రాంగణం' అని పేర్లు పెట్టడం ఏమిటని తమ్మినేని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నియంతలు తాము చేసే పనులకు ఆకర్షణీయ పేర్లు పెట్టుకుంటారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జర్మనీ మాజీ నియంత హిట్లర్ కూడా తన పార్టీకి సోషలిస్టు అని పేరు పెట్టుకున్నాడని తమ్మినేని గుర్తుచేశారు. అదే విధంగా కేసీఆర్ తన నూతన క్యాంపు కార్యాలయంలో కట్టించుకున్న అధికారిక నివాసాలకు అలాంటి పేర్లే పెట్టుకున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మొదటగా సామాజిక న్యాయం జరగాలని తమ్మినేని అన్నారు. దీనిపై ప్రభుత్వానికి కనీస అవగాహన లేక ఎక్కడి సమస్యలు అక్కడే వదిలేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 90శాతానికి పైగా ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ వర్గాల అభివృద్ధిపై సీఎంకు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందనప్పుడు తెలంగాణ సాధించుకున్నా ప్రయోజనమేమీ లేదని వీరభద్రం చెప్పారు. పేదల అభివృద్ధి కాంక్షించని సీఎం బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలాఉంండగా రాష్ట్రంలో పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు గురువారం ఆయన లేఖ రాశారు.
మెదక్ - సంగారెడ్డి జిల్లాల్లో ఫార్మా - ఇతర కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమల విస్తరణ వల్ల మరింత కాలుష్యం పెరిగిందని తద్వారా అక్కడి జీవవైవిధ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వివరించారు. కంపెనీకి చెందిన యూనిట్ల నుంచి వెలువడుతున్న వ్యర్ధాల వల్ల ఆయా గ్రామాల చెరువులు, కుంటలతోపాటు భూగర్భ జలాలు కూడా కలుషితమై పోయాయని వీరభద్రం వివరించారు.తాగునీరుతో పాటు వాడుకునే నీటిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/