Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను తనతో రమ్మంటున్నాడు

By:  Tupaki Desk   |   5 Nov 2016 5:07 AM GMT
కేసీఆర్ ను తనతో రమ్మంటున్నాడు
X
ఏదైనా ఇష్యూ టేకప్ చేస్తే దాని అంతు చూసే వరకూ వదిలిపెట్టని వైనం కమ్యూనిస్టుల సొంతం. పోరాట పటిమ.. ప్రజా ఉద్యమాలతో ప్రజల్లో చైతన్యం కల్పించటం.. ప్రభుత్వాల మీద వ్యతిరేకతను తీసుకురావటంలో వారి ప్లానింగ్ మిగిలిన రాజకీయ పార్టీల తీరుకు పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పాలి. అందుకే.. వామపక్షాలకు ప్రజల్లో ఉండే ఆదరణకు భిన్నంగా.. వారంటేనే రాజకీయ పార్టీలు భయపడే పరిస్థితి. వారితో వైరం పెట్టుకోవటానికి రాజకీయ పార్టీలు కాస్త జంకుతాయి.

కరివేపాకు లాంటి కమ్యూనిస్టులను ఎలా వాడుకోవాలో.. ఎలా తీసి పారేయాలో దివంగత మహా ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెప్పాలి. చరిత్రను చూస్తే.. 2004 వరకు కమ్యూనిస్టులకున్న ఇమేజ్ కి.. తర్వాతి కాలంలో వారికున్న ఇమేజ్ చూస్తే వ్యత్యాసం ఇట్టే తెలిసిపోతుంది. క్రమ పద్ధతిలో ఉద్యమాలు చేపట్టి.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేలా.. ఏవగింపు కలిగేలా చేయటంలో కమ్యూనిస్టులకు సరిసాటి ఎవరూ రారనే చెప్పాలి.

తాజాగా తెలంగాణ అధికారపక్షం తీరుపై కమ్యూనిస్టులు తీవ్రస్థాయి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక.. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం అయితే.. భారీగా యాత్రకు తెర తీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఆయన నిర్వహిస్తున్న సీపీఎం మహాజన పాదయాత్రను తాజాగా నాగర్ కర్నూలు జిల్లా లింగాల.. పెద్ద కొత్తపల్లి మండలాల్లో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘కేసీఆర్ నా వెంట రా. లేదా నీ కొడుకు.. అల్లుడినైనా నావెంట పంపు. గ్రామాల దుస్థితి చూపిస్తా’’ అని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బాగుపడతామనితెలంగాణ ప్రజలు ఎంతగానో ఆశపడ్డారని.. కానీ.. నేడు వారి కలలు కల్లలు కావటమే కాదు.. గ్రామాల్లో కరవు విలయతాండవటం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

దళితుడ్ని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చేసిన హామీతో సహా.. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న తమ్మినేని.. అధికార దాహంతోనే ముఖ్యమంత్రి అయ్యారన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు.. దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి.. లక్ష ఉద్యోగాలు ఇలా ఏ హామీని నెరవేర్చలేదని తమ్మినేని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను కానీ.. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్లనుకానీ తాను చేస్తున్ పాదయాత్రకు వస్తే.. వారికి తెలంగాణ రాష్ట్రంలోని కరవును చూపిస్తానని తీవ్రస్థాయిలో మండిపడుతున్న తమ్మినేనిపై తెలంగాణ అధికారపక్షం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/