Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు గతం గుర్తుచేస్తున్న ఎర్రన్నలు
By: Tupaki Desk | 16 Oct 2016 8:47 AM GMTరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఈనెల 17 నుంచి సీపీఎం పార్టీ ప్రారంభించనున్న ‘సామాజిక న్యాయం-రాష్ట్ర సమగ్రాభివృద్ధి’మహాజన పాదయాత్ర తెలంగాణలో హీట్ పెంచుతోంది. సీపీఎంకు పనీపాట లేకపోవడం వల్లే ఈ యాత్రకు శ్రీకారం చుట్టిందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాజాగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు సీపీఎం అడ్డుపడిందన్నది సరికాదన్నారు. సీపీఎం తెలంగాణను కక్షపూరితంగా అడ్డుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఆ పార్టీ నేతల పాదయాత్రను అడ్డుకోవాలంటూ స్వయంగా కేసీఆర్ పిలుపునివ్వడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో తెలంగాణను అడ్డుకున్నవారే ఇప్పుడు సీఎం కేసీఆర్ కు కుడి - ఎడమలుగా ఉన్నారనే విషయం గమనించాలన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆనాడు గట్టిగా వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వరరావు - తలసాని శ్రీనివాస్ యాదవ్ లను కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకుని అందలం ఎక్కించడం ఏం సంకేతాలను పంపుతుందని తమ్మినేని ప్రశ్నించారు.
సీపీఎం నిజాయితీ - క్రమశిక్షణ ఉన్న పార్టీ అని తర్వాత కేసీఆర్ కితాబు కూడా ఇచ్చారని తమ్మినేని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 37 సీట్లలో తమ పార్టీ పోటీ చేసిందని, మిగిలిన సీట్లలో కాంగ్రెస్ - బీజేపీ - టీడీపీలకు వ్యతిరేకంగా టీఆర్ ఎస్ కే తాము మద్దతునిచ్చామన్నారు. అయినప్పటికీ తమ పార్టీ మొదలుపెట్టనున్న మహాజన పాదయాత్రకు ఆదిలోనే ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరగడాన్ని తమ్మినేని ఖండించారు. ముఖ్యమంత్రి చర్యలను అంతా గమనిస్తున్నారని తమ్మినేని పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/