Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫ్రంట్ కలల్ని చిదిమేస్తున్న కామ్రేడ్లు
By: Tupaki Desk | 11 April 2018 8:09 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయ భవిష్యత్ కు సంబంధించి నీలినీడలు కమ్ముకుంటున్నాయనే ప్రచారం జరుగుతోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ప్రకటించి..ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తన కార్యాచరణను కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. బీజేపీ - కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు చేయాలనే ఈ ఆలోచనకు వామపక్షాలే మూలకారణమని రాజకీయవర్గాల అభిప్రాయం. అయితే అదే వామపక్షాల నుంచి తాజాగా సహాయ నిరాకరణ ఎదురవుతోంది. తాజాగా సీపీఎం తెలంగాణ శాఖ కార్యదర్శి చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. ఫ్రంట్ గురించి కేసీఆర్ కే క్లారిటీ లేనపుడు తాము ఎలా పొత్తుపెట్టుకుంటామని ప్రశ్నించారు.
ఈనెల 18 నుంచి 22వరకు హైదరాబాద్ లో జరగబోయే సీపీఎం పార్టీ అఖిలభారత మహాసభల గురించి తమ్మినేని వీరభద్రం మీడియాతో మాట్లాడుతూ మోడీ గ్రాఫ్ వాయువేగంగా పడిపోతుందని, రాజస్థాన్ - బీహార్ - పంజాబ్ - మధ్యప్రదేశ్ - ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటమితో అర్థమౌతోందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అవలంబించిన ఆర్థిక విధానాలనే మోడీ అవలంబిస్తున్నారని ఆరోపించారు. పేద, సామాన్య ప్రజల సంక్షేమంకన్నా కార్పొరేటు ప్రయోజనాల కోసమే ఈ పార్టీలు పని చేస్తున్నాయని విమర్శించారు.ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి మూడో కూటమి ఏర్పాటు చేసే విషయంలో తమ పార్టీ గతంలోనే చొరవ చూపిందన్నారు. ప్రాంతీయ పార్టీలు దేశ ప్రయోజనాలకన్నా తమ రాష్ట్రాల అవసరాల కోసం, అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మూడో కూటమి నుంచి వైదొలిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు. సామాజిక లక్ష్యం - స్పష్టమైన ఎజెండా లేని టీఆర్ ఎస్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్ లో తమ పార్టీ చేరబోదన్నారు.
ఎస్సీ - ఎస్టీ - బీసీలను ఐక్యం చేసేందుకు తాము ఏర్పాటు చేసిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ ఎఫ్)లోకి రావాలని ఇప్పటికే సీపీఐతో చర్చలు జరుపుతున్నామని తమ్మినేని అన్నారు. గద్దర్ - విమలక్క కూడా బీఎల్ ఎఫ్ తో కలిసి పని చేయడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. సామాజిక న్యాయం కోసమే పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన కోదండరాంకు ఆ చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి పనిచేయాలని కోరారు.