Begin typing your search above and press return to search.
వారిని నిలదీస్తారా? ముక్కు నేలకు రాయిస్తారా?
By: Tupaki Desk | 17 Oct 2016 5:18 AM GMTపవర్ లోకి వచ్చిన తర్వాత మొదటి సారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక కొత్త అనుభవం ఎదురుకానుంది. పోరాటాలకు.. ఉద్యమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కమ్యూనిస్టు నేతలు.. తొలిసారి తన రాష్ట్రంలో ఉద్యమ శంఖం పూరిస్తున్నారు. దాదాపు ఐదు నెలల పాటు తెలంగాణ వ్యాప్తంగా సాగే ఈ పాదయాత్రలో భాగంగా నాలుగు వేల కిలోమీటర్లు కమ్యూనిస్ట్ నేతలు కవర్ చేయనున్నారు. సీపీఎం చేపట్టిన మహా పాదయాత్ర ఎంత పెద్ద కార్యక్రమం అన్నది ఈ కొద్ది మాటల్ని చూస్తేనే అర్థమవుతుంది. అందుకే.. ఈ పాదయాత్ర ప్రారంభం కావటానికి కొద్ది రోజుల ముందే తీవ్రస్థాయిలో విరుచుకుపడటమేకాదు.. ఉద్యమనేత తరహాలో.. పాదయాత్ర చేయనున్న సీపీఎం నేతల్ని అడ్డుకోవాలని.. ముక్కు నేలకు రాయించాలని పిలుపునిచ్చారు.సైద్ధాంతికంగా చిన్నరాష్ట్రాలకు వ్యతిరేకమైన సీపీఎం.. తెలంగాణ ఏర్పాటును పూర్తిస్థాయిలో వ్యతిరేకించింది. చివరకు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందే వేళలో సైతం.. తన వాదన మీదే నిలబడింది తప్పించి.. పోన్లే అంటూ.. మిగిలిన వారి మాదిరి తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మొదటి నుంచి చివరకు ఒకే స్టాండ్ మీద ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది సీపీఎం మాత్రమే.
అలాంటి పార్టీ ఈ రోజు నుంచి వచ్చే ఏడాది మార్చి 12 వరకు పాదయాత్రను నిర్వహించనుంది. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఈ పాదయాత్రకు నాయకత్వం వహిస్తుండగా.. మరో 8 మంది నేతలు ఇందులో పాల్గొంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మొదలయ్యే ఈ పాదయాత్ర ప్రారంభోత్సవానికి రాజ్యాంగ నిర్మాత.. బాబా సాహెబ్ అంబేడ్కర్ మనమడు ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం విప్పి.. గడిచిన 134 రోజులుగా పోరాటం చేస్తున్న సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వేములఘాట్ ప్రజల పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తాము మహా పాదయాత్రను చేపడతామని చెబుతున్నారు. ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టటంతో పాటు.. టీఆర్ ఎస్ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలపై అవగాహన కల్పించే దిశగా ఈ పాదయాత్ర సాగనుంది. మరి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చినట్లుగా ప్రజలు.. కమ్యూనిస్టు నేతల్ని నిలదీయటం.. ముక్కు నేలకు రాయించటం లాంటివి ఎంతమేర చేస్తారన్నది చూడాలి..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/