Begin typing your search above and press return to search.

వీధిలోకి వెళితే కారప్పొడి తీసుకెళ్లాలంట

By:  Tupaki Desk   |   11 Sep 2015 9:12 AM GMT
వీధిలోకి వెళితే కారప్పొడి తీసుకెళ్లాలంట
X
రోజురోజుకీ పెరిగిపోతున్న ఆకతాయిల ఆగడాలను అడ్డుకోవటానికి ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? ఊహించని విధంగా ప్రమాదంలో ఇరుక్కుంటే ఏం చేయాలని లాంటి ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సూచనలు చేస్తున్నారు తాండూరు ఎఎస్సీ చందనా దీప్తి.

ఆకతాయిల్ని అడ్డుకునేందుకు.. వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మహిళలు తాము బజారుకు వెళ్లేటప్పుడు తమ వెంట కూసింత కారప్పొడిని తమతో తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఎవరైనా భౌతికదాడి చేసే ప్రయత్నం చేస్తే.. కారప్పొడితో తమను తాము రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు.

పోకిరీలు ఎదురైన సమయంలో తమను తాము రక్షించుకుంటూ.. పోలీసులు వచ్చే వరకూ కాస్తంత టైమ్ మేనేజ్ చేస్తే సరిపోతుందని ఆమె చెబుతున్నారు. పోకిరీల విషయంలో తొలుత కౌన్సింగ్ ఇస్తామని.. అప్పటికి మాట వినకుండా పదే పదే అలాంటి ఆరోపణలు వస్తే మాత్రం వారిపై నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తామని చెబుతున్నారు.

ఇప్పటివరకూ మహిళలు తమ ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడమని సూచిస్తే.. చందనా దీప్తి మాత్రం కారప్పొడి సజెస్ట్ చేస్తున్నారు. నగర మహిళలకు పెప్పర్ స్ర్పే అందుబాటులో ఉండటం.. గ్రామీణ.. పట్టణ ప్రాంతాల వారికి అందుబాటులో ఉంటుందో లేదో అనుకొని.. కారప్పొడిని వెంట తీసుకెళ్లాలని సూచించి ఉండొచ్చు. ఏమైనా.. బ్యాగుల్లో చాలానే వస్తువులు క్యారీ చేసే వారు.. కాసింత కారప్పొడిని తీసుకెళ్లటం మంచిదే.