Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ లేని ట్యాంక్ బండ్.. హైదరాబాదీల ఎంజాయ్

By:  Tupaki Desk   |   30 Aug 2021 4:30 AM GMT
ట్రాఫిక్ లేని ట్యాంక్ బండ్.. హైదరాబాదీల ఎంజాయ్
X
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న సుందరమైన హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఆదివారం కాగానే ఆనందించడానికి పౌరులు ట్యాంక్ బండ్‌కి చేరుకుంటారు. అక్కడ జనాలు ఎక్కువ సంఖ్యలో పోగు అవుతారు. ఎంజాయ్ చేయడానికి తపిస్తారు. ఈ క్రమంలోనే హైదరాబాదీల కోరికను తెలంగాణ ప్రభుత్వం తీర్చింది. పోలీసులు ట్యాంక్ బండ్ మొత్తం రహదారిలో ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్‌ను ఐదు గంటల పాటు అటు వైపు రాకుండా దారి మళ్లించారు. హైదరాబాదీలకు ఊరట కల్పించారు.

ఈ ఆదివారం నుండి హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు ట్యాంక్ బండ్ రోడ్డు ట్రాఫిక్‌ను సాయంత్రం 5 గంటల నుంచి దారి మళ్లించి ప్రజల కోసమే కేటాయించారు. రాత్రి 10 గంటల వరకు ప్రతి ఆదివారం ఇక ట్యాంక్ బండ్ పై వాహనాలను అనుమతించడం లేదు..

హైదరాబాదీలు ఆహ్లాదకరమైన సాయంత్రాన్ని ఆస్వాదించడానికి పెద్దసంఖ్యలో ట్యాంక్ బండ్ పైనున్న ప్రసిద్ధ హ్యాంగ్అవుట్ ప్రదేశానికి వస్తారు. అక్కడి నీరు.. పరిసరాల అందమైన దృశ్యాన్ని ఎంజాయ్ చేయడానికి సరస్సు వెంట నిలబడిన అనేక కుటుంబాలు సేదతీరుతాయి. రహదారికి అవతలి వైపు పచ్చటి పచ్చిక బయళ్లు.. ఖాళీ ప్రదేశాలలో గడుపుతారు.

పోలీసులు ట్యాంక్ బండ్ పైకి వాహనాలు రాకుండా ట్రాఫిక్‌ను మళ్లించడంతో నిన్న ఆదివారం ప్రజలు ఎంజాయ్ చేశారు. హైదరాబాద్ -సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే 2.2 కిలోమీటర్ల పొడవైన ఈ ట్యాంక్ బండ్ పై నడిచి ఆనందించారు. పిల్లలు ఆడుకోవడం, సైక్లింగ్ చేయడం లేదా స్కేటింగ్ చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు.

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్.. అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రి కేటీఆర్ ఈ ఆదివారం ప్రజలకు ట్యాంక్ బండ్ పై ఈ వరం కల్పించారు. ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు విధించే ఆలోచనలో పని చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు కేటీఆర్ సూచించారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్‌ను రూపొందించారు. దానిని అమలు చేయడం ప్రారంభించారు.

పోలీసు కమిషనర్.. ఇతర అధికారులతో కలిసి ట్యాంక్ బండ్‌ను సందర్శించి.. ఏర్పాట్లను వ్యక్తిగతంగా పరిశీలించారు. అతను కొంతమంది పౌరులతో సంభాషించాడు. ట్రాఫిక్ రహితంగా ఉన్నందుకు సీపీకి కృతజ్ఞతలు తెలిపారు..

అంజనీ కుమార్ మాట్లాడుతూ ట్యాంక్ బండ్ సుందరీకరణ కోసం.. నగరంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. "ట్యాంక్ బండ్ హైదరాబాదుకు చిహ్నం. దీనిని విదేశాలలోని పర్యాటక ప్రదేశాలతో పోల్చారు. ప్రతి ఆదివారం సాయంత్రం సుందరీకరణను చూసి ప్రజలు పర్యటించవచ్చు. ఇప్పుడు ట్రాఫిక్ రహితంగా చేయడం వలన ప్రజలు తమ కుటుంబాలతో నాణ్యమైన సమయాన్ని ఇక్కడ గడపవచ్చు" అని ఆయన చెప్పారు.

పోలీసులు సందర్శకుల కోసం రెండు చివర్లలో రెండు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. జంట నగరాల మధ్య ట్రాఫిక్ సజావుగా సాగడానికి వాహనాలను దిగువ ట్యాంక్ బండ్.. నెక్లెస్ రోడ్ ద్వారా మళ్లించారు.

ఆగష్టు 24న కేటీ రామారావు ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని ప్లాన్ చేయాలని హైదరాబాద్ పోలీసులను కోరారు. ట్రాఫిక్ వల్ల ట్యాంక్ బండ్ పై మొత్తం గందరగోళం నెలకొంటోంది. కుటుంబాలు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నందున ప్రతి ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ కదలికలను పరిమితం చేయాలని ట్విట్టర్‌లో ఒక పౌరుడు చేసిన సూచనను కేటీఆర్ పాటించాడు. వెంటనే పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాంక్ బండ్ పై తరచుగా ఉదయం వాకింగ్ చేసేవారు, కుటుంబాలు సాయంకాలం ఆనందిస్తూ 450 సంవత్సరాల క్రితం ఉన్న సరస్సుపై సూర్యాస్తమయం చూస్తున్నారు. ఈ విస్తరణకు ఇరువైపులా విశాలమైన ఫుట్‌పాత్‌లు ఉన్నాయి.. కవులు, స్వాతంత్ర్య సమరయోధులు మరియు నాయకులతో సహా తెలుగు చిహ్నాల వరుస విగ్రహాలకు కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ట్యాంక్ బండ్ ప్లేస్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన కాస్ట్ ఐరన్ రైలింగ్, గ్రిల్స్.. డిజైనర్ లాంప్ పోస్ట్‌ల ఏర్పాటుతో ఫేస్ లిఫ్ట్ పొందింది.

హుస్సేన్ సాగర్, దాని చుట్టూ ప్రదేశాలు ఆ హ్లాదంగా ఉంటాయి... సహజ సౌందర్యానికి నిలయంగా ఉన్నాయి. బోటింగ్ సౌకర్యాలు మరియు చుట్టుపక్కల పార్కులు, ఫుడ్ జాయింట్లు మరియు ఐమాక్స్ థియేటర్, పౌరులకు అత్యంత పురాతనమైన ప్రసిద్ధమైన హ్యాంగ్అవుట్ ప్రదేశం.

వందలాది కుటుంబాలు సాయంత్రం సరదాగా సరస్సు చుట్టూ గడుపుతారు. కొన్ని సంవత్సరాల క్రితం జోడించబడిన 'లవ్ హైదరాబాద్' శిల్పం వద్ద సెల్ఫీలు దిగుతారు. బోట్ షికారు చేయడం, ముందువైపు నడుస్తున్న పర్యాటకులతో ఈ ప్రదేశం సందడిగా ఉంటుంది. లుంబినీ పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్క్, పీపుల్స్ ప్లాజాలో ఆటలు ఆడుతూ, ఈట్ స్ట్రీట్‌లో రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తూ ప్రతిరోజూ పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తారు.