Begin typing your search above and press return to search.
ఇంకెన్ని టేపులు ఉన్నాయి..?
By: Tupaki Desk | 8 Jun 2015 2:12 PM GMTగత ఆదివారం ఒక వీడియో టేపు సృష్టించిన రాజకీయ సంచలనం ఇంకా సద్దుమణగక ముందే.. రెండో ఆదివారం రాత్రి మరో టేపు మరింత సంచలనం రేపింది. ఈ లెక్కన ఇంకెన్ని టేపులు తెలంగాణ అధికారపక్షం వద్ద ఉన్నాయన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించిన టేపు తమ వద్ద ఉందని చేసిన వ్యాఖ్య కలకలం రేపితే.. దాన్ని విడుదల చేసి.. మరింత రాజకీయ సంచలనానికి కారణం అయ్యారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర సర్కారుకు చెందిన ముఖ్యల టేపులు తమ వద్ద ఉన్నాయని గతంలో టీడీపీ శాసనసభాపక్షం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వ్యాఖ్యానించటం తెలిసిందే. ఇంత జరుగుతున్నా ఇప్పటివరకూ అలాంటి టేపుల్ని వారు బయటపెట్టింది లేదు. కానీ.. ఒక మీడియా సంస్థ మాత్రం.. ఒక డీఎస్పీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన టేపును బయటపెట్టారు. అందులో.. వైరా ఎమ్మెల్యేకి మంత్రి కేటీఆర్ రూ.3కోట్లు ఇస్తామని ఆఫర్ చేసిన విషయాన్ని తనకు స్వయంగా చెప్పారంటూ వ్యాఖ్యానించారు.
మిగిలిన అంశాల మీద తీవ్రంగా స్పందించే తెలంగాణ అధికారపక్షం.. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన టేపు మాత్రం మాట్లాడటం లేదు. అయితే.. కేటీఆర్ మాత్రం స్పందించి.. తనకు లైడిటెక్టర్ పరీక్షలు టీవీల సాక్షిగా చేపట్టాలని సవాలు విసిరారు. రాజకీయాల్లో ఇలాంటివి మామూలే.
ఇక.. తెలంగాణ అధికారపక్షం వద్ద ఇంకెన్ని టేపులు ఉన్నాయన్న అంశంపై తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది. ఏసీబీ ఉన్నతాధికారులు చెబుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తెలంగాణరాష్ట్ర సర్కారు దగ్గర ఇంకెలాంటి టేపులు లేవని చెబుతున్నారు. తమ వద్దనున్న రెండు టేపుల్ని రెండు సార్లు వ్యూహాత్మకంగా బయటపెట్టిన సర్కారు.. టేపుల పరిణామాలతో మరింత రాజకీయం చేయాలని భావిస్తోందని.. ఇంతకు మించి వారి వద్ద ఎలాంటి టేపులు లేవని చెబుతున్నారు. టేపుల సంచలనాల ఎపిసోడ్ పూర్తయినట్లేనా?