Begin typing your search above and press return to search.
హాలీడే ట్రిప్ అన్న ఆ ఆంటీ వెళ్లింది ఎక్కడికంటే..?
By: Tupaki Desk | 18 Jan 2016 9:11 AM GMTహాలీడే ట్రిప్ కు వెళుతున్నట్లు తన 14 నెలల బాబును వెంటపెట్టుకొని ఒక ఆంటీ తన ఇంట్లో వారికి చెబితే ఏమనుకుంటాం? వెళ్లమ్మా.. సరదాగా ఎంజాయ్ చేసిరా అని వీడ్కోలు పలుకుతాం. కానీ.. ఈ బ్రిటన్ ఆంటీ కత మాత్రం పూర్తి భిన్నం. ఇంట్లో హాలీడే ట్రిప్ అని చెప్పి.. ఏకంగా నరరూప రాక్షసులైన ఐసిస్ తీవ్రవాదుల అడ్డాకు వెళ్లి వచ్చింది.
2014 అక్టోబరులో హాలీడే కోసం టర్కీకి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పిన తరీనా షకీల్ అనే బ్రిటీష్ మహిళ ఐసిస్ కు పట్టున్న రక్కాకు వెళ్లింది. అక్కడ ఆమెకు ఉగ్రవాదులు మంచి బస ఏర్పాటు చేశారట. ఏకే 47తో సహ పలు ఆయుధాలు కూడా ఇచ్చారట. ఆ ఆయుధాలతో కొడుకుతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ అమ్మడు ఏం తెలీనట్లుగా టర్కీ నుంచి లండన్ కు తిరిగి వచ్చేసింది.
అయితే.. ఈ ఆంటీ మీద కన్నేసిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించటం మొదలు పెట్టారు. ఐసిస్ ఉగ్రవాదుల వద్దకు వెళ్లి వచ్చిన ధైర్యమో ఏమో కానీ.. చక్కటి ఒక అబద్ధాన్ని అల్లేసి.. తాను టర్కీకి వెళతే.. తనను కిడ్నాప్ చేశారని.. తాను తప్పించుకొని వచ్చినట్లుగా కథ చెప్పిందట. అయితే.. అమ్మడు చెప్పిందంతా కథ అని.. ఎందుకంటే ఇంట్లో వాళ్లతో ఐసిస్ ను అభిమానించాలని.. లేకుండా వారితో తాను మాట్లాడనని చెప్పినట్లుగా అధికారులు ఆమెపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ వ్యవహారం మరో మూడు నెలల్లో ముగుస్తుందని చెబుతున్నారు. హాలీడే అంటూ ఐసిస్ తీవ్రవాదుల వద్దకు వెళ్లి వచ్చిన ఈ బ్రిటీష్ ఆంటీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.