Begin typing your search above and press return to search.

టీడీపీ స‌ర్వే.. నేత‌ల ఏరి వేత ఖాయ‌మా?

By:  Tupaki Desk   |   12 Dec 2021 10:31 AM GMT
టీడీపీ స‌ర్వే.. నేత‌ల ఏరి వేత ఖాయ‌మా?
X
టార్గెట్ 2024 ఎన్నిక‌లు! ఇదీ.. ఇప్పుడు.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌లు వేసే ప‌రి స్తితి తీసుకువ‌చ్చింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి.. అధికారంలోకి వ‌చ్చేందుకు టీడీపీ అధినేత చం ద్ర‌బాబు ఇప్ప‌టికే శ‌ప‌థం చేసిన విష‌యం తెలిసిందే. గ‌త నెల‌లో ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్న ప‌రిణా మాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు తాను మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే స‌భ‌లోకి అడుగు పెడతాన‌ని శ‌ప‌థం చేశారు. సో.. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు శ‌ప‌థం నెర‌వేరాలంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా టీడీపీ విజ‌యం సాధించాలి. మ‌రి ఇప్పుడున్న ప‌రిస్థితిలో వార్డుల్లోనే గెలుపు గుర్రం ఎక్క‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా విజ‌యం ద‌క్కించుకుంటుంద‌నే ప్ర‌శ్న అంద‌రినీ వేధిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే పార్టీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ప‌నిచేసే వారికే చోటు.. అంటూ.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న త‌ర‌చుగా చెబుతున్నారు. నేత‌ల‌కు వార్నింగులు ఇస్తున్నారు. పార్టీలో స‌రిగా ప‌నిచేయ‌ని వారిని ప‌క్క‌న పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలో పార్టీలో చేయాల్సిన స‌మూల మార్పుల దిశ‌గా ఒక కీల‌క స‌ర్వే చేప‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ఈ స‌ర్వేలో టీడీపీ లో నేత‌ల ప‌రిస్థితిని జ‌ల్లెడ ప‌ట్ట‌నున్నారు.

ఎవ‌రు ప‌నిచేస్తున్నారు? ఎవ‌రు అధికార పార్టీతో మిలాఖ‌త్ అయి.. మ‌భ్య పెడుతున్నారు? నేతలపై ఆ పార్టీ స్థానిక కేడర్‌ ఏమనుకుంటోంది...? కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు చేదోడువాదోడుగా ఉంటున్నారా...? ప్ర భుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా..? లేదా..? పార్టీ అధిష్టానం పిలుపు మేరకు కార్యక్రమాలు సీరియ‌స్‌గా చేస్తున్నారా..? మొక్కు బడిగా ముగిస్తున్నారా..? పార్టీలో అందర్నీ ఏకతాటిపై తీసుకుని, పనిచేస్తున్నారా..? గ్రూపులను ప్రోత్సహిస్తున్నారా...? వంటి అంశాల‌పై.. స‌ర్వే చేస్తున్నారు.

అదేవిధంగా.. కార్యకర్తలను అయోమయానికి లోనుచేసేలా ఎవరికి వారు వ్యవహరిస్తున్నారా..? నియోజకవ ర్గాల్లో ద్వితీయ శ్రేణిలో పట్టున్న నాయకులను ఎదగనీయకుండా దూరం పెట్టేలా వ్యవహరిస్తున్నారా..? ఎవ‌రి దూకుడు ఎలా ఉంది.? ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతున్న‌వారు ఎంద‌రు? అనే అనేక అంశాలపై స‌ర్వే చేప‌డుతున్నారు. ఈ స‌ర్వేలో నేరుగా ప్ర‌జ‌ల నుంచి తీసుకునే అభిప్రాయాల‌కే ఎక్కువ మార్కులు ఇచ్చే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. పార్టీ నేత‌లు స‌రిగాలేర‌ని.. వారు.. ఇత‌ర పార్టీల నేత‌ల‌తో మిలాఖ‌త్ అయి.. పార్టీ ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని..త‌ర‌చుగా చంద్ర‌బాబు చెబుతున్నారు.

నిన్న‌టికి నిన్న నెల్లూరుకు చెందిన ముగ్గురు నేత‌లను ఇవే కార‌ణాల‌తో పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు. నెల్లూరులో ఇటీవ‌ల జ‌రిగిన కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌లు.. అధికార పక్షానికి కొమ్ము కాశార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. త‌మ‌ను పొగిడే నేత‌ల‌కు.. టికెట్లు ఇవ్వ‌డం. కూడా అప్ప‌ట్లోనే వివాదానికి దారితీసింది. దీంతో ప్ర‌స్తుతానికి ముగ్గురు నేత‌ల‌పై వేటు వేసిన‌.. చంద్ర‌బాబు మ‌రింత మందిపైఊ చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స‌ర్వే చేప‌డుతుండ‌డం పార్టీలో సంస్క‌ర‌ణ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టుగానే భావించాల్సి ఉంటుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.