Begin typing your search above and press return to search.

పార్టీల‌పై 'ఐటీ' గురి.. బీజేపీ వ్యూహం ప‌దును పెరిగిందా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 11:53 AM GMT
పార్టీల‌పై ఐటీ గురి.. బీజేపీ వ్యూహం ప‌దును పెరిగిందా?
X
ఇప్ప‌టి వ‌ర‌కు వ్య‌క్తుల‌ను ల‌క్ష్యంగా చేసుకున్న ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు.. ఇప్పుడు.. పార్టీల‌పై ప‌డ్డా రు. ఇది.. వాస్త‌వానికి దేశ చ‌రిత్రలోనే ఫ‌స్ట్ టైమ్ అని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో ఇలా.. రాజ‌కీయ పార్టీల‌ను అజెండాగా చేసుకుని.. ఇలా దాడులు చేసిన ప‌రిస్థితిలేదు. కానీ, ఇప్పుడు.. రాజ‌కీయ పార్టీల‌పై.. ఐటీ అధికారులు దేశ‌వ్యాప్తంగా దాడులు చేయ‌డం.. ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీని వెనుక పైకి చెబు తున్న‌కార‌ణం బాగానే ఉన్నా.. అంత‌ర్లీనంగా చూస్తే.. రాజ‌కీయ‌దృక్కోణం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రుగుతోంది?

దేశవ్యాప్తంగా ఆదాయ పన్ను శాఖ దాడులు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలపై పలు రాష్ట్రాల్లో సోదా లు నిర్వహిస్తోంది. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయి, గుర్తింపు పొందని రాజకీయ పార్టీలే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

పలు పార్టీలు నిధులు తప్పుగా చూపిస్తున్నాయన్న అనుమానాలతో ఈ చర్యలకు దిగినట్లు స్పష్టం చేశాయి. ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు.

రాజకీయ పార్టీలతో పాటు వాటితో సంబంధం ఉన్న సంస్థలు, నిర్వాహకులకు వ్యతిరేకంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం సిఫార్సు ప్రకారం ఆదాయ పన్ను శాఖ ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈసీ 87 పార్టీలపై చర్యలు తీసుకుంది. రిజిస్టర్డ్ జాబితా నుంచి వాటిని తొలగించిం ది. వెరిఫికేషన్ సమయంలో వాటి జాడ తెలియలేదని తెలిపింది. రిజిస్టర్ అయి, గుర్తింపు పొందని 2,100 రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకుంటున్నట్లు గతంలో ప్రకటించింది.

అనుమానాలు ఇందుకే!

+ గ‌తంలోనూ లెక్క‌లు చూప‌ని నిధులు పోగేసిన పార్టీలు ఉన్నాయి. కానీ.. అప్ప‌ట్లో ఇలాంటి చ‌ర్య‌లు ఎవ‌రూ తీసుకోలేదు.

+ ప్ర‌స్తుతం కేంద్రంలోని మోడీ స‌ర్కారు దూకుడు పెంచింది. త‌న‌కు గిట్ట‌ని పార్టీలు.. త‌నను విమ‌ర్శిస్తు న్న నాయ‌కుల‌పై సీబీఐ, ఈడీల‌ను ఉసిగొల్పుతున్నార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

+ ఇక‌, ఇప్పుడు.. రాజ‌కీయ పార్టీల‌పై ఐటీ దాడుల వెనుక‌.. ఖ‌చ్చితంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూట‌మి క‌ట్టే పార్టీల‌కు హెచ్చ‌రిక‌లు పంప‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

+ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇత‌ర పార్టీలు కూట‌మిగా ఏర్పాటు అయితే.. ఆ ప‌రిణామం.. త‌న‌కు ముప్పు తెస్తుంద‌ని.. ప్రధాని మోడీ భావించ‌డం వ‌ల్లే.. ఇలా.. వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఢిల్లీ రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.