Begin typing your search above and press return to search.

'రాఫెల్'డీల్...ఎన్సీపీ ఎంపీ రాజీనామా!

By:  Tupaki Desk   |   28 Sep 2018 11:57 AM GMT
రాఫెల్డీల్...ఎన్సీపీ ఎంపీ రాజీనామా!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు `రాఫెల్`వ్య‌వ‌హారం బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసిన సంగ‌తి తెలిసిందే. `రాఫెల్`ను ఆయుధంగా మ‌లుచుకున్న కాంగ్రెస్....బీజేపీపై మాట‌ల దాడిని కొన‌సాగిస్తోంది. కాంగ్రెస్ కు తోడుగా బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌న్నీ మోదీ స‌ర్కార్ పై `రాఫెల్` ను కేంద్రంగా చేసుకొని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మోదీకి మ‌ద్ద‌తుగా ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్ చేసిన వ్యాఖ్య‌లు చాలామందిని షాక్ కు గురిచేశాయి. మోదీ ఉద్దేశ్యాల‌పై ప్ర‌జ‌ల‌కు ఎటువంటి అనుమానాలు అక్క‌ర‌లేద‌ని శ‌ర‌ద్ ప‌వార్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ప‌వార్ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ గుర్రుగా ఉంది. ఈ క్ర‌మంలోనే ప‌వార్ వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌డుతూ ప‌వార్ స‌న్నిహితుడు - ఎన్సీపీ ఎంపీ తారిఖ్ అన్వ‌ర్ ఎన్సీపీకి నేడు రాజీనామా చేశారు.

ఎస్సీపీ సీనియర్‌ నేత - కతిహార్‌ ఎంపీ తారిఖ్‌ అన్వర్‌ ఆ పార్టీకి శుక్ర‌వారం నాడు రాజీనామా చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ కు అత్యంత‌ సన్నిహితుడైన అన్వ‌ర్....మోదీకి మద్దతుగా పవార్‌ మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆ వ్యాఖ్య‌లు త‌న‌ను ఎంతో బాధించాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ క్ర‌మంలోనే క‌తిహార్‌ లోక్‌ సభ సభ్యత్వంతోపాటు పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నట్లు శుక్ర‌వారం నాడు ప్రకటించారు. రాఫెల్ ఒప్పందంపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని అన్వ‌ర్ డిమాండ్ చేశారు. రెండు ద‌శాబ్దాల క్రింద పీఏ సంగ్మాతో పాటుకాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన అన్వ‌ర్ ఎన్సీపీలో చేరారు. సోనియా గాంధీ విదేశీయ‌త వ్య‌వ‌హారం న‌చ్చ‌క‌ అన్వ‌ర్ పార్టీని వీడారు.