Begin typing your search above and press return to search.
తరుణ్ కి 13.30 గంటలు తప్పలేదు
By: Tupaki Desk | 23 July 2017 4:27 AM GMTగత కొద్దిరోజులుగా వరుసగా టాలీవుడ్‌కు చెందిన వారిని డ్రగ్స్ విషయంలో ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. గంటల కొద్దీ సమయం విచారిస్తున్న టాలీవుడ్ సెలబ్రిటీలలో ఒకనాటి హీరో తరుణ్ విచారణ ఏకంగా 13.30 గంటల పాటు సాగింది. శనివారం ఉదయం 10 గంటలకు తన తండ్రితో కలిసి హీరో తరుణ్ విచారణకు హాజరు కాగా.. రాత్రి 11.40 గంటల తర్వాతే ఆయన విచారణ ముగిసింది. ఈ సందర్భంగా సాగిన విచారణలో తమది డీసెంట్ ఫ్యామిలీ అని తరుణ్ చెప్పినట్లుగా తెలిసింది.
హైదరాబాద్ డ్రగ్ కల్చర్.. పబ్బులకు డ్రగ్స్ ఎలా వస్తాయి? ఎలా డీల్ చేస్తారు? అన్న అంశాల మీద ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు. గతంలో తరుణ్ సొంతంగా పబ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు తరుణ్ సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది. తాను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని.. సరఫరా చేయలేదని కూడా స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.
డ్రగ్స్ తీసుకునేందుకు ఈవెంట్ మేనేజర్లు ప్రత్యేకంగా పార్టీలు చేస్తుంటారని.. పబ్ లకు వచ్చే వారిలా కాకుండా సెలబ్రిటీలకు ప్రత్యేక గదుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తుంటారని చెప్పినట్లుగా సమాచారం. తరచూ గోవా ఎందుకు వెళుతున్నట్లు తరుణ్ ను ప్రశ్నించినట్లుగా తెలిసింది. కెల్విన్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణపైనా క్వశ్చన్లు వేసినట్లుగా చెబుతున్నారు.
తరుణ్ గోవా ట్రిప్ లపై అధికారులు అడిగిన ప్రశ్నలకు తరుణ్ ఎదురు ప్రశ్నలు వేసినట్లుగా చెబుతున్నారు. సిట్ చేసిన ఆరోపణల్ని ఖండిస్తూ.. గోవా తరచూ వెళ్లే వారంతా డ్రగ్స్ తీసుకున్నారనుకుంటే ఎలా అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. తన స్నేహితులకు గోవాలతో హెటళ్లు.. రెస్టారెంట్ బిజినెస్ లు ఉన్నాయని.. తాను సినిమాలకు దూరమై చాలా కాలమైందని.. తానిప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ తో బిజీగా ఉన్నట్లు చెప్పారని చెబుతున్నారు.
తరుణ్ విచారణ దాదాపు పదమూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. మధ్యాహ్నం లంచ్ కోసం కాసేపు బ్రేక్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సిట్ బృందం భోజనం ఏర్పాటు చేయగా.. తాను ఉపవాసం ఉన్నట్లుగా చెప్పినట్లు తెలిసిందే. దీంతో.. కొన్ని పండ్లను.. పండ్ల రసాల్ని అందించగా.. ఒక యాపిల్.. కాస్త జ్యూస్ మాత్రమే తరుణ్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. డ్రగ్స్ కేసుల్లో ప్రధాన నిందితులైన కెల్విన్.. జీశాన్ లతో కలిసి పబ్బుల్లో డ్యాన్సులు చేస్తున్న వీడియోలను అధికారులు విచారణ సందర్భంగా చూపించారని చెబుతున్నారు.
అయితే.. దీనికి తరుణ్ స్పందిస్తూ.. తాను నిర్వహించిన పలు ప్రైవేటు పార్టీలకు వారు ఈవెంట్ మేనేజర్లుగా పరిచయం అయ్యారని చెప్పినట్లుగా సమాచారం. తరచూ పార్టీల్లో కలవటం కారణంగా వీడియోలలో కనిపించి ఉండొచ్చని తరుణ్ సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. సిట్ విచారణలో భాగంగా రక్త నమూనాను.. గోళ్లను సేకరిస్తున్న అధికారుల బృందం తరుణ్ విషయంలోనూ అదే తీరులో ఫాలో అయినట్లుగా సమాచారం.