Begin typing your search above and press return to search.

హిజాబ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంచలన రచయిత్రి

By:  Tupaki Desk   |   20 Sep 2022 4:30 AM GMT
హిజాబ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంచలన రచయిత్రి
X
తస్లీమా నస్రీన్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంచలన రచయిత్రిగా కొందరు.. వివాదాస్పద రచయిత్రిగా మరికొందరు అభివర్ణించే ఈ బంగ్లాదేశ్ మహిళా రచయిత్రి చేసే వ్యాఖ్యలు తరచూ సంచలనంగానే కాదు.. ఆమె తలకు ఖరీదు కట్టే మత ఛాందసవాదులకు సైతంతరచూ సవాలు విసురుతూ ఉంటాయి. తాజాగా ఆమె హిజాబ్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

తమ ధర్మాగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఇరాన్ మహిళలు చేస్తున్న నిరసనలపై ఆమె స్పందించారు. ఇరాన్ లో మహిళలు హిజాబ్ ధరించకపోవటం దారుణమైన నేరం. అయితే.. ఇటీవల ఆసుపత్రిలో చేరిన మహిళ ఒకరు హిజాబ్ లేని వైనంపై ఆమెను భౌతికంగా హింసించిన వైనంపై ఇరాన్ మహిళలు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమ కాదు.. హిజాబ్ ను విడిచి.. జట్టును కత్తిరించి తమ నిరసనను వీధుల్లోకి వచ్చి వ్యక్తం చేసిన వైనం గురించి తెలిసిందే. ఇలాంటివేళ.. తస్లీమా నస్రీన్ స్పందించారు.

హిజాబ్ మహిళల ఎంపిక కాదని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు ఇరాన్ లో జరిగిన నిరసనల నుంచి ధైర్యం పొందుతున్నారని వ్యాఖ్యానించారు. హిజాబ్ పై ఇరాన్ మహిళల నిరసనలు.. హిజాబ్ ను కాల్చేసి.. జట్టు కత్తిరించుకున్న మహిళలకు తాను సెల్యూట్ చేస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.

హిజాబ్అన్నది మహిళల అణచివేతకు.. అవమానానికి చిహ్నంగా ఆమె అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా తమ హిజాబ్ ను కాల్యేసి.. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా నిరసన గళాన్ని విప్పాలని కోరారు.

మహిళలు హిజాబ్ ను ధరించే విషయానికి సంబంధించి తనకున్న అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించిన తస్లీమా కీలక వ్యాఖ్యలు చేశారు. 'హిజాబ్ ధరించాలని భావించే మహిళలకు దాన్ని ధరించే హక్కు ఉండాలి. ఇష్టపడని వారు హిజాబ్ ధరించకుండా ఉండే హక్కు ఉండాలి.

హిజాబ్ మహిళల ఎంపిక కాదని..అయినా ధరిస్తారన్నారు. కారణం.. వారి తల్లిదండ్రులు.. కుటుంబ సభ్యులు బలవంతంగా మహిళలు హిజాబ్ ధరించేలా బ్రెయిన్ వాష్ చేస్తారన్నారు. మత ఛాందసవాదులు స్త్రీలను బురఖా.. హిజాబ్ ధరించమని బలవంతం చేస్తారన్నారు. ఈ వ్యాఖ్యలతో తస్లీమాపై మరింత మండిపాటు ఖాయమని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.