Begin typing your search above and press return to search.
అమీర్ ఖాన్ ఇన్నాళ్లూ నటించాడన్న మాట
By: Tupaki Desk | 25 Nov 2015 10:35 AM GMTఅసలు రంగు బయటపెట్టుకున్న అమీర్ ఖాన్ పై అందరి నుంచీ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఒక్కరు కూడా ఇంతవరకు అమీర్ ఖాన్ కు మద్దతుగా మాట్లాడలేదు. తాజాగా బంగ్లాదేశ్ కు చెందిన సంచలన రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా అమీర్ కు చీవాట్లు పెట్టారు. ఆమె చేసినట్లుగా కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నప్పటికీ అవి ఆమె చేసినవి కావట... ఆ సంగతి తస్లీమాయే స్వయంగా వెల్లడించారు.. అయితే.. ఆ సందర్భంలో ఆమె అమీర్ కు హితవు పలకడం విశేషం. ''అమీర్ పై నేను చేసినట్లుగా సోషల్ మీడియాలో ఉన్న వ్యాఖ్యలు నావి కావు.. అయితే.. అమీర్ ఖాన్ కు ఒక విషయం చెప్పదలచుకున్నాను. ఆయన, ఆయన కుటుంబం ఉండడానికి ఇండియా కంటే భద్రమైన దేశం ఇంకొకటి మాత్రం ఉండదు'' అని తస్లీమా అన్నారు.
తస్లీమా వ్యాఖ్యల్లో ఎంతో నిజం ఉంది. లజ్జ నవల తరువాత ఆమెకు ఎక్కడా రక్షణ లేకపోతే ఇండియాలో తలదాచుకోగలిగింది. ఆమే కాదు.. ఆమెలా ఎందరో ఇండియాలో బతికిబట్టకట్టారు. ఇండియాకు వచ్చి పేరు తెచ్చుకున్నారు. ఇండియా ఎంత భద్రమైన దేశమో చెప్పడానికి దలైలామా కూడా పెద్ద ఉదాహరణ. ఇండియాయే అక్కున చేర్చుకోకుంటే దలైలామా పరిస్థితి ఎలా ఉండేదో వేరే చెప్పనవసరం లేదు.
అద్నాన్ సమీది మరో కథ. పాకిస్థాన్ కు చెందిన ఈ గాయకుడి ఇండియాలో ఎంత ఆదరణ ఉందో తెలియంది కాదు. అందుకే ఆయన ఇండియాలోనే శాశ్వత నివాసం ఏర్పరుచుకున్నారు. చాలాకాలం కిందటే అద్నాన్ ఒక ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పారు... అమీర్ వంటి వారికి దాన్ని వినిపించేవారుంటే బాగుణ్ను. పాకిస్థాన్ లో పుట్టిన అద్నాన్ ప్రతిభావంతుడైన గాయకుడు.. పాక్ లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకు పేరు రాలేదు. పేరు రావాలంటే అమెరికాయో - ఇంగ్లండో - కెనడాయో వెళ్లాల్సిందేనని ఎవరో చెబితే అదీ ట్రై చేశాడు. కెనడాలో చాలాకాలం ప్రయత్నాలు చేశాడు. అక్కడా గుర్తింపు రాలేదు. ఆ తరువాత అనుకోకుండా ఇండియా వచ్చాడు. ఆయన గొంతులో పలికే విషాదం, జీర భారతీయ సంగీతాభిమానులకు నచ్చింది. ఆయన ఆల్బమ్ లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇండియా మెచ్చిన గాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. సక్సెస్, పేరు కోసం ప్రపంచమంతా తిరిగినా ఫలితం రాలేదని.. ఇండియాకు వచ్చిన తరువాత తన పేరు ప్రపంమంతా మారుమోగిపోయిందని అద్నాన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతేకాదు... సక్సెస్ కోసం ఎక్కడికో ఎందుకు వెళ్తారు.. ఇండియాకు వచ్చేయండి అంటూ పిలుపిచ్చాడు కూడా. ఇప్పటికీ అద్నాన్ కు ఉన్న ఆదరణ - క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
పాకిస్తాన్ కు చెందిన అద్నాన్ తనకు జీవితాన్ని, పేరుప్రఖ్యాతులను ఇచ్చిన ఇండియా పట్ల చూపిన అభిమానం, విశ్వాసంలో కనీసం ఒక శాతం చూపించినా అమీర్ ను ప్రజలు క్షమించేవారేమో... ఇండియా ఎంత భద్రమైనదో బంగ్లాదేశ్ కు చెందిన తస్లీమా నస్రీన్ కు అర్థమైనట్లుగా అమీర్ కు కూడా అర్థమైతే ఈ ఆవేదనే ఉండేది కాదేమో. ఇన్నాళ్లూ అభిమానించిన హీరో్ ఇలాంటివాడా అని ఎందరో హతాశులయ్యారు. అయితే... అమీర్ వ్యాఖ్యలతో భారతదేశం, ప్రపంచానికి కూడా ఒక విషయం అర్థమైంది. అది.. అమీర్ ఇన్నాళ్లూ ముసుగేసుకున్నాడని... ఒళ్లంతా విద్వేషాన్ని నింపుకుని 'నటించాడని'. అవును... అందరం ఒప్పుకుందా అమీర్ ఖాన్ గొప్ప నటుడే