Begin typing your search above and press return to search.

టాటా గ్రూపు కీలక నిర్ణయం..20 శాతం కోత!

By:  Tupaki Desk   |   25 May 2020 11:30 AM GMT
టాటా గ్రూపు కీలక నిర్ణయం..20 శాతం కోత!
X
వైరస్ సంక్షోభంతో టాటా గ్రూపు టాప్ మేనేజ్ మెంట్ తొలిసారి కీలక నిర్ణయం తీసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహా, టాటా గ్రూప్ కంపెనీల సీఈఓలు వేతనంలో కోత విధించుకునేందుకు నిర్ణయించుకున్నారు. టాటా గ్రూపు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తోలిసారి కావడం గమనార్హం. ఖర్చు తగ్గించే చర్యలను ప్రారంభించిన నేపథ్యంలో 20 శాతం దాకా వేతన కోతకు సిద్ధమయ్యారు. వైరస్ , లాక్‌ డౌన్ కారణంగా వ్యాపారం ప్రభావితం కావడంతో సంస్థ తాజా నిర్ణయం వెలువడింది.

తాజా నిర్ణయం ప్రకారం టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్, ట్రెంట్, టాటా ఇంటర్నేషనల్, టాటా క్యాపిటల్, వోల్టాస్ ఇతర కంపెనీల సీఈవోలు, ఎండీలు వారి వారి జీతాలను తగ్గించుకుంటారు. అలాగే ప్రస్తుత సంవత్సర బోనస్‌ లను వదులుకోనున్నారు. ఈ వరుసలో గ్రూప్ ప్రధానమైన, అత్యంత లాభదాయక సంస్థ టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ ముందు వరుసలో నిలిచారు. సంస్థ ప్రకటించిన సమాచారం ప్రకారం గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2019-20లో రాజేష్ రెమ్యునరేషన్ 16.5 శాతం తగ్గి రూ .13.3 కోట్లకు చేరుకుంది. వైరస్ ప్రేరిత సంక్షోభం సమయంలో పే-కట్ తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం ఇదేనని కంపెనీ వెల్లడించింది.