Begin typing your search above and press return to search.

టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా

By:  Tupaki Desk   |   21 Jun 2017 1:14 PM GMT
టాటా గ్రూప్ చేతికి ఎయిర్ ఇండియా
X
ప‌్ర‌భుత్వ‌రంగ విమాన‌యాన సంస్థ ఎయిరిండియా అమ్మ‌కానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. సింగ‌పూర్ ఎయిర్‌ లైన్స్‌ తో క‌లిసి ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయాల‌ని టాటా గ్రూప్ భావిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే టాటా గ్రూప్ చైర్మ‌న్ ఎన్ చంద్ర‌శేఖ‌ర‌న్ ప్ర‌భుత్వంతో అన‌ధికారిక చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్లు బిజినెస్ న్యూస్ చానెల్ ఈటీ నౌ ఓ క‌థ‌నాన్ని ప్ర‌సారం చేసింది. ఎయిరిండియాలో 51 శాతం వాటా కొనుగోలుకు టాటా గ్రూప్ ఆస‌క్తి చూపుతున్న‌ట్లు ఆ చానెల్ వెల్ల‌డించింది.

తాజాగా జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మై ఈ డీల్ పూర్త‌యితే ఎయిరిండియా సొంతగూటికి చేరిన‌ట్లే. 1953లో ఎయిరిండియాను జాతీయం చేయ‌క‌ముందు ఈ ఎయిర్‌ లైన్స్ టాటా గ్రూప్ చేతుల్లోనే ఉండేది. రూ.52 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ప్రైవేటైజ్ చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. గ‌తంలో చైర్మ‌న్‌ గా ఉన్న ర‌త‌న్ టాటా కూడా ఎయిరిండియాను కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూపారు.

టాటా గ్రూప్ ఇప్ప‌టికే ఎయిర్ ఏషియా - విస్తారా ఎయిర్‌ లైన్స్‌ లో భాగ‌స్వామిగా ఉంది. నిజానికి ఎయిరిండియా 1932లో టాటా ఎయిర్‌ లైన్‌ గా ప్రారంభ‌మైంది. టాటా గ్రూప్ వ్య‌వ‌స్థాప‌కుడు జేఆర్డీ టాటా దీనిని ప్రారంభించారు. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌ర్వాత 1948లో అది ఎయిరిండియా ఇంట‌ర్నేష‌న‌ల్‌ గా మారింది. ఐదేళ్ల త‌ర్వాత దీనిని జాతీయం చేసి ప్ర‌భుత్వం త‌న ఆధీనంలోకి తీసుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/