Begin typing your search above and press return to search.
వారొక్కరే టాటాకు 1120 కోట్ల ఆర్డర్ ఇచ్చారు
By: Tupaki Desk | 1 Oct 2017 8:04 AM GMTదేశీయ కంపెనీగా సుపరిచితమైన టాటా కంపెనీ భారీ ఆర్డర్ ను సొంతం చేసుకుంది. విశ్వసనీయత ఉన్న కంపెనీల్లో ఒకటిగా భారతీయులు నమ్మే టాటాగ్రూపులోని టాటా మోటార్స్ కు భారీ ఆర్డర్ చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్.. సింఫుల్ గా చెప్పాలంటే ఈఈఎస్ ఎల్ కు అవసరమైన విద్యుత్ వాహనాల్ని సరఫరా చేసే టెండర్ ను సొంతం చేసుకుంది.
ఈ ఆర్డర్ విలువ ఏకంగా రూ.1120 కోట్లు కావటం గమనార్హం. మంత్రులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల రవాణా అవసరాల కోసం విద్యుత్ వాహనాల్ని వినియోగించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.1120 కోట్ల విలువైన వాహనాల కోసం టెండర్లు పిలిచారు. ఈ టెండర్ ను చేజిక్కించుకోవటంలో టాటా మోటార్స్ తో పాటు.. నిస్సాన్.. ఎం అండ్ ఎం కంపెనీలు పోటీ పడ్డాయి. ఇందులో నిస్సాన్ టెండర్ ను సాంకేతికంగా రిజెక్ట్ చేశారు.
మిగిలిన రెండు టెండర్లలో టాటా మోటార్స్ ను ఎంపిక చేశారు. ఈఈఎస్ ఎల్ పేర్కొన్న ఒక్కో వాహనానికి టాటా మోటార్స్ సంస్థ రూ.10.16 లక్షలు కోట్ చేసింది. జీఎస్టీతో కలిపి రూ.11.2 లక్షలుగా పేర్కొంది. ఇంతే సామర్థ్యం ఉన్న వాహనాలకు ఇతర కంపెనీలు టాటా మోటార్స్ కోట్ చేసిన దాని కంటే 25 శాతం అధికంగా వసూలు చేస్తుండటం గమనార్హం.
మిగిలిన కంపెనీలు మూడేళ్లు మాత్రమే వారెంటీ ఇస్తుంటే..టాటా మోటార్స్ మాత్రం ఐదేళ్లు వారెంటీ ఇవ్వనున్నట్లు చెప్పటంతో ఈ భారీ ఆర్డర్‌ను టాటాకు ఇవ్వాలని కేందం ప్రభుత్వ రంగ సంస్థ నిర్ణయించింది. ఈ భారీ ఆర్డర్ ను లెటర్ ఆఫ్ ఇండెంట్ అందిన తొమ్మిది నెలల్లో డెలవరీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ భారీ ఆర్డర్ టాటా మోటార్స్ ను మరింత బలోపేతం చేయటం ఖాయం.