Begin typing your search above and press return to search.
సోషల్ మీడియా పోస్టులపై ఐటీ కన్ను!
By: Tupaki Desk | 12 Sep 2017 1:30 PM GMTస్మార్ట్ ఫోన్లు - ఫ్రీ ఇంటర్నెట్ ప్రభావంతో ఈ మధ్య సోషల్ మీడియాలో సెల్ఫీలు - ఫొటోలు పోస్ట్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఏదన్నా కొత్త వస్తువు కొన్న వెంటనే దానిని ఇంట్లో వాళ్లకు చూపించడానికి ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చాలా మందికి ఓ సరదా. ఇక ఏదన్నా ఫారిన్ వెకేషన్ టూర్ కి వెళితే తమ గొప్పలు చెప్పుకోవడానికి అక్కడి ఫొటోలను కుప్పలు తెప్పలుగా పోస్ట్ చేయడం కొందరికి అలవాటు. అయితే, ఏదై నా చిన్నా చితకా వస్తువైతే ఆ ఫొటోలు పెట్టిన వారికి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ, ఖరీదైన కార్లు - ఫారిన్ వెకేషన్ టూర్లలో మీరు ఎంజాయ్ చేసిన ఫొటోలు వంటివి సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది. ఎందుకంటే, ఆ ఫొటోలతో మీకు తిప్పలు తప్పక పోవచ్చు. ఎందుకంటే, మీ సోషల్ మీడియా ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ నిఘా నేత్రం రాబోతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు మీ లావాదేవీలపై, కొనే వస్తువులపై - లక్జూరియస్ లైఫ్ పై ఓ కన్ను వేయనున్నారు.
అయితే, మీరు మీ ఆదాయానికి సక్రమంగా ట్యాక్స్ పే చేయడం - రిటర్న్స్ సకాలంలో దాఖలు చేయడం వంటివి చేసి ఉంటే సదరు ఫొటోలను నిర్భయంగా పోస్ట్ చేసుకోవచ్చు. వచ్చిన చిక్కల్లా పన్ను ఎగవేత దారులకే. దేశంలో నల్లధనాన్ని వెలికితీసేందుకు ఆదాయం పన్ను శాఖ సోషల్ మీడియా - వెబ్ సైట్లపైనా గూఢచర్యం చేయనుంది. ఇందుకోసం ప్రాజెక్ట్ ఇన్ సైట్ పేరుతో వచ్చే నెలలో ఓ స్పెషల్ ప్రాజెక్ట్ చేపట్టనుంది. బిగ్ డాటా అనలిటిక్స్ టూల్స్ ద్వారా మీ సోషల్ సైట్ అకౌంట్ల నుంచి సేకరించిన వివరాలు - ఫొటోలు - వీడియో పోస్టింగ్ లను మీ ఐటీ రిటర్నులతో మ్యాచ్ చేయనుంది. ఒకవేళ మీరు పన్ను ఎగవేస్తున్నట్లు ఐటీ శాఖకు అనుమానం వస్తే మీకు ఇబ్బందులు తప్పవు. ప్రాజెక్ట్ ఇన్‌సైట్ కోసం గత ఏడాది ఐటీ డిపార్ట్ మెంట్ ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ తో ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన టెక్నాలజీ ప్లాట్ ఫాంను ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ సమకూరుస్తోంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ టూల్స్ బీటా టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ టూల్స్ ను పూర్తి స్థాయిలో డెవలప్ చేసి వచ్చే నెలలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది.