Begin typing your search above and press return to search.

ట్యాక్స్ టాక్ : ఆస్తిప‌న్నులో లీస్ట్ జీఎస్టీలో టాప్

By:  Tupaki Desk   |   2 May 2022 12:30 PM GMT
ట్యాక్స్ టాక్ : ఆస్తిప‌న్నులో లీస్ట్ జీఎస్టీలో టాప్
X
ఎర్లీ బ‌ర్డ్ ఆఫ‌ర్ పేరిట పుర‌పాల‌క సంస్థ‌లు మ‌రియు న‌గ‌ర పాల‌క సంస్థ‌లు ఇచ్చిన ఆఫ‌ర్లు (ముందుగానే ఆస్తిప‌న్ను చెల్లిస్తే ఐదు శాతం రిబేటు) కాస్త ఫ‌లితం ఇవ్వ‌లేదు ఆంధ్రావ‌నిలో ! కానీ జీఎస్టీ వ‌సూళ్లు మాత్రం టాప్ లేపాయి. గత ఏడాది క‌న్నా వృద్ధి రేటు చాలా అంటే చాలా బాగుంది. దీంతో సంబంధిత అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ ప్ర‌శంసిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో ఎన్న‌డూ లేనివిధంగా గ‌త నెల ఏప్రిల్ లో నిర్దేశిత‌ల ల‌క్ష్యాల‌ను దాటుకు ఆదాయం తీసుకురావ‌డంలో సంస్థాగ‌త కృషితో పాటు ముఖ్య‌మంత్రి ఇచ్చిన ప్రోత్సాహం కూడా బాగుంద‌ని సంబంధిత వ‌ర్గాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి.

ఈ మేరకు సీటీ అసోసియేష‌న్ వ‌ర్గాలు గ‌తం క‌న్నా భిన్నంగా రాణించే ప్ర‌క్రియ‌లో ముఖ్యంగా ఆర్థిక ప్ర‌గ‌తికి దోహ‌దం కావ‌డంలో మంత్రి వ‌ర్గంతో పాటు మిగిలిన నాయ‌కులు ఇచ్చిన ప్రోత్సాహం బాగుంద‌ని అంటున్నాయి. గ‌త ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వృద్ధి 16 శాతం అధికంగా ఉంది.

దేశ వ్యాప్తంగా వ‌సూలైన జీఎస్టీ మొత్తాలు ల‌క్షా 67 వేల కోట్ల‌కు పైగా ఉంటే, అందులో ఏపీ వాటా నాలుగు వేల 67 కోట్లు ఉండ‌డం గ‌మ‌నార్హం. గత ఏడాది అయితే ఇదే ఏప్రిల్ నాటికి వ‌సూలు అయిన జీఎస్టీ మూడు వేల 345 కోట్లు అని తేలింది. ఆ విధంగా చూసుకుంటే జ‌గ‌న్ ప్ర‌భుత్వం మంచి ఫ‌లితాలు అనే క‌న్నా అనూహ్య రీతిలో ఫ‌లితాలు సాధించి విజ‌య శంఖారావం పూరించింది. గెలుపు నాదం వినిపించింది.


దేశ‌వ్యాప్తంగా కూడా గ‌త ఏడాది క‌న్నా ఈ ఏడాది జీఎస్టీ వ‌సూళ్లు బాగా పెరిగాయి. 25 కోట్లు అద‌నంగా డ‌బ్బులు వ‌చ్చి చేర‌డంతో సంబంధిత వ‌ర్గాలు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నాయి. ప‌న్నుల వసూళ్లు ఇంత బాగున్నా రాష్ట్రాల‌కు తిరిగి చెల్లించేట‌ప్పుడు మాత్రం కేంద్రం బేరాలు పెడుతోంది.

ఇదే సిస‌లు నిరాశ‌కు కార‌ణం. జీఎస్టీ వృద్ధిరేటు ఏపీ ఒక‌టో నంబ‌ర్ స్థానం ద‌క్కించుకోవ‌డంతో ఇప్పుడిక మ‌న‌కు ద‌క్కే వాటాలు ఏ విధంగా ఉంటాయో అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఒక‌టి రేగుతోంది. పొరుగున ఉన్న ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఈ రీజియ‌న్ కు సంబంధించి ఏపీ టాప్ ప్లేస్ లో ఉండ‌డంతో ఆదాయంలో (ప‌న్నుల వ‌సూళ్ల‌తో స‌మకూరిన ఆదాయం) మ‌న‌కు ముఖ్యంగా రాజ‌ధాని పేరిట కానీ ఇత‌ర మౌలిక వ‌స‌తుల పేరిట కానీ చెల్లించేది ఏమ‌యినా ఉందా అన్న వాద‌న కూడా వినిపిస్తోంది.

జీఎస్టీ వ‌సూళ్ల‌లో తెలంగాణ‌ను సైతం ఏపీ దాటేసింది. తెలంగాణ వృద్ధి రేటు 16 శాతానికే ప‌రిమితం అయి ఉండ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఇదే స‌మ‌యంలో తెలంగాణ, జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఆస్తి ప‌న్ను వ‌సూళ్ల‌న్న‌వి ఏపీనే దాటేశాయి. అక్క‌డ ప‌న్నుల ద్వారా స‌మ‌కూరిన ఆదాయం ఏడు వంద‌ల కోట్లకు పైగా కానీ ఇక్క‌డ 496 కోట్లు. వృద్ధి ప‌రంగా గ‌త ఏడాది క‌న్నా 55 శాతం అద‌నంగా ఉన్నా, తెలంగాణ‌తో ముఖ్యంగా హైద్రాబాద్ తో పోలిస్తే మ‌నం చాలా వెనుకంజ‌లో ఉన్నాం అన్న‌ది ఓ వాస్త‌వం.