Begin typing your search above and press return to search.
టీబీ వ్యాక్సిన్ తీసుకున్నోళ్లు కరోనా నుంచి సేఫ్
By: Tupaki Desk | 11 July 2020 10:30 AM ISTకరోనా కోరలు చాస్తోంది. దాన్ని అరికట్టడంలో ఇప్పుడు అందరూ కిందా మీద పడుతున్నారు. మందు కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు కిందా మీద పడుతున్నారు. అయితే కరోనాకు వందేళ్ల క్రితం ప్రబలిన క్షయ వ్యాధికి దగ్గర పోలికలున్నాయి. రెండు వ్యాధి లక్షణాలు సేమ్. రెండూ ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. దీంతో నాటి క్షయ (టీబీ) వ్యాక్సిన్ అయిన బీసీజీ తీసుకున్న వారిని ఇప్పుడు కరోనా ఏం చేయడం లేదని తాజా పరిశోధనలో తేలింది.
అమెరికాకు చెందిన అలర్జీ, సంక్రమణ రోగాల సంస్థ చేసిన ఓ అధ్యయనంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కరోనా మరణాలను అడ్డుకోవడంలో క్షయ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా బీసీజీ వ్యాక్సినేషన్ కొనసాగుతున్న దేశాల్లో మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు.
వ్యాక్సినేషన్ తీసుకున్న లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా నియంత్రణలో ఉందని.. తీసుకోని న్యూయార్క్, ఫ్లోరిడా, ఇల్లినాయస్ లో తీవ్రత ఎక్కువగా ఉందని తేల్చింది. అలాగే వ్యాక్సినేషన్ జరిగిన తూర్పు జర్మనీలో మరణాల రేటు 2.9శాతం పశ్చిమ జర్మనీ కంటే తక్కువగా ఉంది. ఇక ఫిన్లాండ్ తో పోలిస్తే ఇటలీలో మరణాల రేటు ఏకంగా 4 రెట్లు ఎక్కువ.
ఇలా టీబీ వ్యాక్సినేషన్ తీసుకున్న దేశాల్లో మరనాల రేటు 10శాతం తగ్గిందని శాస్త్రవేత్తలు తెలిపారు.