Begin typing your search above and press return to search.
మరో రికార్డ్ సృష్టించిన టీసీఎస్ .. ఏంటంటే ?
By: Tupaki Desk | 25 Jan 2021 4:30 PM GMTభారతీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరోసారి అరుదైన ఘనతను సాదించింది. సోమవారం (జనవరి 25) న మరో ఐటీసంస్థ యాక్సెంచర్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన ఐటీ కంపెనీగా అవతరించింది. టీసీఎస్ మార్కెట్ విలువ సోమవారం ఉదయం169.9 బిలియన్ డాలర్లను దాటింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో యాక్సెంచర్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్లు. కాగా మార్కెట్ క్యాప్ కు సంబంధించి టీసీఎస్ ఇంతకుముందు రెండుసార్లు యాక్సెంచర్ కంపెనీని అధిగమించింది. 2018 లో ఒకసారి, గత ఏడాది అక్టోబర్ లో మరోసారి టీసీఎస్ యాక్సెంచర్ ను దాటేసింది.
అయితే ఆ తర్వాత షేర్ కాస్త తగ్గింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ 167 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అమెరికన్-ఐరిష్ మల్టీనేషనల్ ఐటీ సంస్థ, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీ యాక్సెంచర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 168 బిలియన్ డాలర్లుగా నమోదయింది. టీసీఎస్ నెంబర్ వన్ స్థానం కాసేపు మాత్రమే నిలిచింది. టీసీఎస్ నేడు ఆల్ టైమ్ గరిష్టం రూ.3,339ని తాకింది. ఆ సమయంలో మార్కెట్ క్యాప్ పరంగా యాక్సెంచర్‌ను దాటేసింది.
అయితే మధ్యాహ్నం సెషన్ లో స్టాక్ రూ.3,318 వద్ద ఉంది. దీంతో టీసీఎస్ మార్కెట్ క్యాప్ 168 బిలియన్ డాలర్ల కంటే కిందకు వచ్చింది. ఇక టీసీఎస్ భారత అతిపెద్ద ఐటీ సంస్థ. అన్ని లిస్టెడ్ కంపెనీలను పరిగణలోకి తీసుకుంటే రిలయన్స్ మొదటి స్థానంలో ఉండగా, టీసీఎస్ రెండో స్థానంలో ఉంది. ఐటీ సంస్థల్లో భారత్ అతిపెద్ద మార్కెట్ క్యాప్ టీసీఎస్‌దే. టీసీఎస్ 167 బిలియన్ డాలర్లు, ఇన్ఫోసిస్ 78 బిలియన్ డాలర్లు, HCL టెక్నాలజీస్ 36 బిలియన్ డాలర్లు, విప్రో 33 బిలియన్ డాలర్లు, టెక్ మహీంద్రా 13 బిలియన్ డాలర్లుగా ఉంది.