Begin typing your search above and press return to search.

శుభవార్త: ఉద్యోగుల వేతనాల పెంపు

By:  Tupaki Desk   |   8 Oct 2020 5:33 AM GMT
శుభవార్త: ఉద్యోగుల వేతనాల పెంపు
X
దేశంలోనే ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ఆశ్చర్యపరిచింది. బుధవారం 2020-21 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. ఆదాయం మూడు శాతం పెరిగినా నికర లాభం 7శాతం క్షీణించింది. ఫలితాల సందర్భంగా పెట్టుబడిదారులతోపాటు ఉద్యోగులకు టీసీఎస్ గుడ్ న్యూస్ తెలిపింది.

ఈ సందర్భంగా ఉద్యోగులకు వేతనాలు పెంచుతున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. మెగా బైబ్యాక్ ప్రకటించింది. బైబ్యాక్ ప్రతిపాదనకు బుధవారం టీసీఎస్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.

అక్టోబర్ 1వ తేది నుంచి పనితీరు ఆధారంగా వేతనాలు పెంచుతున్నట్లు టీసీఎస్ తెలిపింది. 2020 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి నాటికి కంపెనీలో కొత్తగా చేరిన 1600 మందితోపాటు టీసీఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 453450కు చేరుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగాలు, జీతాలకు భారీ కోతలు పడుతున్న సమయంలో టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయం ఆశాజనకంగా మారింది.

ఇక కొత్త రిక్రూట్ మెంట్లు కూడా ప్రారంభించామని.. సెప్టెంబర్ క్వార్టర్ లో అంతర్జాతీయంగా రిక్రూట్ మెంట్ పెంచామని తెలిపారు. ఉద్యోగుల వలసలు ఆల్ టైమ్ కనిష్టం 8.9శాతానికి చేరుకున్నాయన్నారు.

ఇప్పటికే టీసీఎస్ చేతిలో పలు ఆర్డర్లు ఉన్నాయని.. మరికొన్ని డీల్స్ కోసం చర్చలు జరుగుతున్నాయని.. దీంతో కంపెనీ వ్యాపార భవిష్యత్ ఆశాజనకంగా ఉందని టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ తెలిపారు.