Begin typing your search above and press return to search.
టీడీపీ, 50 వెబ్ సైట్ల సీక్రెట్ కథ..
By: Tupaki Desk | 18 Nov 2019 6:47 AM GMTదేశంలోనే మీడియా మేనేజ్ మెంట్ లో చంద్రబాబును మించిన వారు లేరని కథలు కథలుగా చెబుతారు. మీడియా మేనేజ్ మెంట్ లో బాబు గూరూజీ అని కూడా అంటారు. ఇటీవలే ఏపీలో కొలువుదీరిన వైఎస్ జగన్ పై జాతీయ మీడియాను సైతం బాబు గారు మేనేజ్ చేసి అభూతకల్పనలు రాయిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
తన ప్రత్యర్థులను మీడియాను ఉపయోగించి తుత్తునియలు చేయగల సామర్థ్యం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని రాజకీయాల్లో చెబుతుంటారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టాప్ 2 పత్రికలు, టాప్ న్యూస్ చానెల్స్ అంతా చంద్రబాబుకు సపోర్టుగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. కేవలం ఒకటి రెండు మీడియాలు మాత్రమే ప్రతిపక్ష వైసీపీకి ఉన్నాయి. ఇలా రాష్ట్ర మీడియానే కాదు.. జాతీయ మీడియాను కూడా ప్రాభావితం చేయగల సత్తా మన బాబుగారికి ఉండడం అదృష్టంగా టీడీపీ శ్రేణులు తొడలు కొట్టుకుంటాయి.
అయితే బాబుగారి మీడియా మేనేజ్ మెంట్ కథ ఇన్నాళ్లు బయటకు రాలేదు. తాజాగా టీడీపీని వీడిన వల్లభనేని వంశీ.. బాబు గారి మీడియా గుట్టును అధికారికంగా విప్పారు. చంద్రబాబు తన ప్రత్యర్థులపై బురద జల్లడానికి, అభూతకల్పనలు సృష్టించి అభాసుపాలు చేయడానికి పెద్ద వ్యవస్థనే ఏర్పాటు చేశారని వంశీ బాంబు పేల్చారు. స్వయంగా టీడీపీ ఆఫీసులోనే 50 వెబ్ సైట్లు టీడీపీ నిడిపిస్తున్నారని..అది కూడా ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో నడిపారని బాంబు పేల్చారు. సోషల్ మీడియాలో వ్యక్తులును, పార్టీలను టార్గెట్ చేసి కించపరచడానికి కూడా టీడీపీ ఆఫీసే వేదిక అని వంశీ సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు.
మొత్తంగా టీడీపీ ఆఫీసు కేంద్రంగానే నడిచే 50 వెబ్ సైట్లు, సోషల్ మీడియా విభాగాలు.. ఇంటెలిజెన్స్ అధికారుల ఆధ్వర్యంలో గుట్టుగా సాగుతాయని వంశీ చెప్పాడు. తన మీద నెగెటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు దీని మీద ఆరాతీయగా స్వయంగా ఇంటెలిజెన్స్ అధికారులే తనకు ఈ విషయం చెప్పారని వంశీ సంచలన విషయం చెప్పారు. హైదరాబాద్ లోని టీడీపీ నుంచి ఓ 10 వే ల మెయిల్స్ పంపి నడిపిస్తుంటారని తెలిపారు. తనపై విచిత్రమైన రాతలు రాసిన వారిపై చంద్రబాబు, లోకేష్ లను అడగగా.. ఆంధ్రజ్యోతి ఖమ్మం రిపోర్టర్ రాశాడని టీడీపీ ఆఫీసునుంచే ఇదంతా నడిచిందని వారి చెప్పిన విషయాన్ని వంశీ వివరించాడు.
ఇలా వంశీ టీడీపీ గుట్టుమట్లను, చంద్రబాబు మీడియా మేనేజ్ మెంట్ కథను విడమరిచి చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ లోని టీడీపీ ఆఫీసు కేంద్రంగానే చంద్రబాబు ఈ మీడియా మేనేజ్ మెంట్ తో ప్రత్యర్థులను దెబ్బతీస్తున్న వైనాన్ని వంశీ వివరించాడు. బాబు గారి మీడియా మేనేజ్ మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో వంశీ చెప్పిన నిజాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.