Begin typing your search above and press return to search.
జగన్ లో మార్పు తెచ్చిన బాబు : టీడీపీ!
By: Tupaki Desk | 26 July 2022 6:18 AM GMTఇవాళ కోనసీమ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది.ఈ పర్యటనతో అయినా బాధితులకు న్యాయం దక్కాలని చంద్రబాబు ఆశిస్తున్నారు ! వాస్తవానికి తమ అధినేత చంద్రబాబు క్షేత్ర స్థాయి పర్యటన చేశాకే, ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి నాలుగు మాటలు చెబుతూ నిలదీశాకే ఈ ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నది టీడీపీ వాదన.
వీలున్నంత వరకూ ప్రజలకు మేలు చేయాలని, ఈ పర్యటనతో అయినా వాస్తవిక స్థితిగతులు సరిగ్గా అంచనా వేసి, బాధితులకు తక్షణ సాయం అందించాలని టీడీపీ నేతలు అడుగుతున్నారు.
కోనసీమ జిల్లాతో పాటు తూగో, పగో లలో వరద ప్రభావం దారుణంగా ఉంది. పోలవరం ముంపు గ్రామాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించాల్సి ఉంది. కానీ ఆయనెందుకనో వెనుకంజ వేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది.
మీరు ముసలోడు అంటున్నారు... కానీ యువకుల కంటే ఎక్కువగా వరద ప్రాంతాల్లో తిరిగి ప్రజల కష్టాలు వింటున్నారు చంద్రబాబు అని, చూసి నేర్చుకోండని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. వాస్తవాలు తెలుసుకునేందుకు క్షేత్ర స్థాయి పర్యటనల తప్ప వేరే మార్గం లేదన్నారు.
సీఎం పర్యటన మాత్రం ఇవాళ రాజోలు వరకూ మాత్రమే పరిమితం అయి ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి క్షేత్ర స్థాయి పర్యటన ఎప్పుడు చేస్తారని విపక్షం ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది.
ఈ పాటి అయినా సీఎంలో కదలికవచ్చిందంటే తాము వెళ్లాక తమ అధినేత మాట్లాడేక వచ్చిన మార్పేనని సోషల్ మీడియాలో టీడీపీ తన క్రెడిట్ తీసుకుంటోంది. వీలైనంత వరకూ వరద పీడిత ప్రాంతాలకు సాయం అందించాలంటే సమీప ప్రాంతంలో సీఎం కొన్ని రోజులు ఉండి, సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉందని, కానీ ఆ విధంగా కాకుండా సీఎం రూట్ ఖరారు కావడం విచిత్రంగానే ఉందని అంటున్నారు. ఒక్కరోజు పర్యటనతో తెలిసేదేంటని ? తెలుసుకుని చేసేందేంటని ? నిలదీస్తున్నాయి విపక్షాలు.