Begin typing your search above and press return to search.
మాటలేమో కానీ..జగన్ సభలో చెప్పులు ఎగిరాయ్
By: Tupaki Desk | 5 Jun 2016 6:25 AM GMTఅధినేతల మాటలు తూటాల్లా పేలుతుంటే.. వారి ఫాలోయర్స్ మాత్రం ఊరికే ఉంటారా? ప్రస్తుతం రైతు భరోసా యాత్రను నిర్వహిస్తున్న ఏపీ విపక్ష నేత జగన్ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చని ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుతో కొట్టాలంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలాన్ని రేపటం తెలిసిందే.
శనివారం రాత్రి అనంతపురం జిల్లా కదిరిలో జరిగిన బహిరంగ సభ రసాభాసగా సాగింది. రాయలసీమలో మోసం చేసిన వారిని చెప్పులతో కొట్టాలని అంటారంటూ తన మాటల్ని సమర్థించుకునే ప్రయత్నం జగన్ చేశారు. జగన్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు కొందరు ప్రయత్నించటం గందరగోళంగా మారింది.
జగన్ ప్రయాణిస్తున్న వాహనం కదిరిలోని ఇందిరాగాంధీ కూడలి వద్దకు వచ్చినంతనే కొందరు జగన్ ప్రచార రథం వైపు చెప్పులు విసరటం.. దీనికి ప్రతిగా వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు చెప్పులు విసిరిన వారివైపు చెప్పులు విసరటంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో జోక్యం చేసుకున్న పోలీసులు.. విపక్ష నేతను ప్రచార రథం మీద నుంచి కిందకు దించి కాన్వాయ్ వాహనంలోకి ఎక్కించేసి ముందుకు పంపించారు. మొత్తమ్మీదా చెప్పులతో కొట్టాలంటూ జగన్ ఇచ్చిన పిలుపు పుణ్యమా అని.. ఇప్పుడాయన సభలో కొత్త రచ్చ షురూ అయ్యిందని చెప్పాలి.