Begin typing your search above and press return to search.
బాబే పెద్దన్న...జగన్ కి కూటమి దడ
By: Tupaki Desk | 10 Jan 2023 10:19 AM GMTఏపీలో మహా కూటమికి అంకురార్పణ జరిగిపోయింది. సంక్రాంతి పండుగ వారం రోజులు ఉందనగానే ఏపీ సీఎం జగన్ కి అసలైన రాజకీయ సంక్రాంతి సినిమాను చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలసి చూపించారు. చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వడంతోనే ఏపీ రాజకీయాలు షేక్ అయిపోవడం మొదలైంది. చంద్రబాబు పవన్ రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు అంటే అందులో రాజకీయ సారం లేకుండా ఉంటుందా.
అక్కడ ఉన్నది రాజకీయంగా గండర గండడు చంద్రబాబు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ సైతం జగన్ని ఓడించాలని చేతులు కలిపారు. దాంతో మహా కూటమికి బాబు ఇంట్లోనే పునాది పడింది అని అంటున్నారు. కూటమిలో అతి పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. ఇక చంద్రబాబే కూటమి సారధి. ఇందులో కూడా డౌటే లేదు.
అందుకే పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కరచాలనం చేశారు. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్న దాని మీద రచ్చ సాగుతున్నా పవన్ కళ్యాణ్ నుంచి పెద్దగా వత్తిడిలు అయితే ఉండవని అంటున్నారు. పైగా చంద్రబాబు సారధ్యంలో ఏర్పడే కూటమి అందులో తెలుగుదేశం తరువాత జనసేనకే రెండవ ప్లేస్. ఇది చాలు ఆ పార్టీ ఫుల్ సాటిస్ఫై అవడానికి.
ఇక కధ మొత్తం చంద్రబాబు నాయకత్వంలో నడిపిస్తారు అని అంటున్నారు. జనసేనతో సానుకూలంగానే పొత్తుల కధ సాగిపోతుంది అని అంటున్నారు. ఈ భేటీ తరువాత కమ్యూనిస్టులను కూడా కలుపుకుంటారు అని అంటున్నారు. తొందరలో వారు కూడా వచ్చి బాబుని కలుస్తారని చెబుతున్నారు.
వారికి కూడా ఇవ్వాల్సిన ప్రాధ్యాన్యతను బాబు ఇస్తూనే మహా కూటమిని మరింతగా పటిష్టం చేస్తారు అని తెల్సుతోంది. ఇక ఆ మీదట బీఎస్పీ కాంగ్రెస్ వంటి పార్టీలు వచ్చి చేరినా చేరవచ్చు. ఇక కూటమి పెద్దన్నగా చంద్రబాబుకు మొత్తం 175 సీట్ల మీద అవగాహన ఉంది. వైసీపీ బలం బలహీనతో పాటు తమ పార్టీ బలం, ఇతర మిత్ర పక్షాల బలాలను అన్నీ ఆధారం చేసుకుని ఒక కచ్చితమైన అంచనాకు వచ్చిన తరువాతనే సీట్ల కేటాయింపు చేస్తారని అంటున్నారు.
అంటే బాబు పూర్తి అవగాహనతో పూర్తి వ్యూహాలతో ఎవరిని ఎక్కడ నుంచి పోటీకి దింపాలి ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏ క్యనడిడేట్ అయితే వైసీపీని ఢీ కొట్టడానికి బాగుంటుంది అని ఆలోచించి మరీ అభ్యర్ధులను ఖరారు చేస్తారు అని అంటున్నారు. అంటే చంద్రబాబు మొత్తం 175 సీట్లకు అభ్యర్ధులను తానుగా ఎంపిక చేసినా లేక సూచించినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు.
ఇక్కడ మరో తమాషా కూడా ఉంది అంటున్నారు. అదేంటి అంటే పవన్ చంద్రబాబు కలిశాక మహా కూటమికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కూటమిలో చేరేందుకు ఎలాంటి భేషజాలు లేకుండా షరతులు పెట్టకుండా మిగిలిన పార్టీలు కూడా వస్తున్నాయని అంటున్నారు. అంటే బాబు సారధిగా అంతా నూరు శాతం మనస్పూర్తిగా అంగీకరిస్తూ ఆయన ఎత్తులను నమ్ముతూ ముందుకు సాగుతున్నాయన్న మాట.
మొత్తానికి చూస్తే వైసీపీ ఒంటరి పోరు చేస్తూ సింగిల్ గా వస్తామని అంటోంది. కానీ బాబు నాయకత్వంలో పటిష్టమైన మహా కూటమి వచ్చి ఢీ కొంటే అధికార వైసీపీకి అది బాగా ఇబ్బంది పెట్టే అంశమే అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో ఏది ఏమైనా బాబు ఈజ్ గ్రేట్ అని మరోసారి ఏపీలో మారుతున్న రాజకీయాన్ని చూసిన వారు అనుకుంటున్నారు.