Begin typing your search above and press return to search.
కమలం గూటికి సీనియర్ తమ్ముడు పయనం!
By: Tupaki Desk | 24 Jun 2019 5:29 AM GMTసుజనా చౌదరి.. సీఎం రమేశ్.. టీజీ వెంకటేశ్ లాంటి పేర్లు విన్నంతనే పారిశ్రామికవేత్తలు కమ్ రాజకీయ నాయకులుగా కనిపిస్తారు. తమ ప్రయోజనాలే తప్పించి పార్టీ ప్రయోజనాలు పెద్దగా పట్టవన్నట్లుగా వీరిపై విమర్శ ఉంది. ఇలాంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయినా పెద్దగా నష్టం లేదంటూ చెప్పుకుంది తెలుగుదేశం పార్టీ.
అయితే.. తాజాగా అందుకు భిన్నమైన పరిస్థితి. ఎన్టీఆర్ టైం నుంచి పార్టీలో ఉంటూ. .పార్టీకి అత్యంత విధేయుడిగా.. నమ్మకస్తుడిగా ఉంటూ పలు పదవుల్ని చేపట్టిన పొలిటిషియన్ కమ్ సినీ నిర్మాత కమ్ వ్యాపారవేత్త అంబికా కృష్ణ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్న మాట బాబు బ్యాచ్ కు షాకిస్తుందని చెప్పాలి.
నలుగురు రాజ్యసభ సభ్యులు పార్టీని వీడిపోవటంతో తగిలిన షాక్ నుంచి బయటకు రాని టీడీపీకి.. తాజాగా అంబికా ఎగ్జిట్ మరింత దెబ్బ తగలటమే కాదు.. పార్టీలో దశాబ్దాల తరబడి ఉన్న సీనియర్లు సైతం సైకిల్ దిగేయటం కచ్ఛితంగా దెబ్బేనన్న మాట వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ రోజు ఢిల్లీకి వెళ్లనున్న అంబికా కృష్ణ.. బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన అంబికా కృష్ణ.. ప్రముఖ అగరబత్తి కంపెనీ అయినా అంబికా దర్బార్ బత్తిస్ ఆరోమా ఇండస్ట్రీస్ కు ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఆయన పేరు చెప్పినంతనే టీడీపీ నేతగా గుర్తించే ఇమేజ్ ఉన్న నాయకుడు పార్టీని వీడి బీజేపీలోకి చేరటం పార్టీకి తీవ్ర నష్టమని చెప్పక తప్పదు.