Begin typing your search above and press return to search.
పవన్ అందరికీ లైట్ అయిపోయారా?
By: Tupaki Desk | 17 Feb 2018 1:05 PM ISTజనసేన పార్టీ అధినేత - సినీ నటుడు పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. 2014 ఎన్నికల సమయంలో ఎంట్రీ ఇచ్చిన జనసేనాని ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ ద్వయానికి మద్దతు ఇచ్చారు. వారితో మిత్రపక్షంగా కొనసాగారు. ఆ రెండు పార్టీల గెలుపులో ముఖ్య పాత్ర పోషించారు. అనంతరం అటు సినిమాలు - ఇటు రాజకీయాలు రెంటిని సమన్వయం చేసుకుంటూ వస్తూ 2018 నుంచి ఫుల్ టైం రాజకీయవేత్తగా ఉంటానని ప్రకటించారు. అయితే ఈ పర్వంలో పవన్ ప్రకటనలను - డెడ్ లైన్లను పలువురు సీరియస్ గా పట్టించుకున్న దాఖలాలు లేవనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.
అన్నట్లుగానే కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయంపై గళం వినిపించడం మొదలుపెట్టారు. ఈ నిరసన గళాన్ని ఒకింత లేటుగానే వినిపించిన పవన్..ఏపీకి అసలేం దక్కిందనేది తేల్చేందుకు రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు. లోక్ సత్తా అధినేత జేపీ - రాజకీయవేత్త ఉండవల్లితో పాటు ఇతర మేధావులు - నిపుణులు - రాజకీయ పార్టీల నాయకులతో కలిసి...జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విభజన సమయంలో కేంద్రం ఎలాంటి హామీలిచ్చింది ? ఎంతవరకు హామీలు అమలయ్యాయి ? ఇంకా ఎలాంటి హామీలు అమలు కావాల్సి ఉంది ? నిధులు ఎన్ని వచ్చాయి ? ఎంత ఖర్చయ్యాయి ? ఇతరత్రా అంశాలపై కమిటీ వేసినట్లు తెలిపారు.
అన్నీ ఇచ్చేశామని బీజేపీ చెప్తుండటం - అరకొరగా ఇచ్చారని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో నిజాలు తేల్చేందుకు ఈ జేఎఫ్ సీ ఏర్పాటు చేశానని పవన్ వెల్లడించారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధుల వివరాలను టీడీపీ తనకు పంపించాలని కోరుకుంటున్నట్లు అలాగే రాష్ట్రానికి పంపించిన నిధుల వివరాలను బీజేపీ నేతలను కోరుతున్నట్లు పవన్ తెలిపారు. ఈ వివరాలను పంపిస్తే...కమిటీ అధ్యయనం చేసి నిజాలు చెబుతుందన్నారు. అయితే ఆశ్చర్యంగా..ఈ పవన్ ఇచ్చిన ఈ పిలుపును...ఆయన పెట్టిన డెడ్ లైన్ ను ఒకనాటి ఆయన మిత్రపక్షాలు సీరియస్ గా తీసుకోలేదని చర్చ జరుగుతోంది. జేఎఫ్ సీ మొదటి సమావేశం వరకు కూడా ఇటు టీడీపీ కానీ అటు బీజేపీ కానీ పవన్ కోరిన వివరాలు అందించలేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు అయితే...`ప్రత్యేకంగా వివరాలు ఇవ్వడం ఎందుకు? వెబ్ సైట్లో ఉన్నాయి చూసుకోవచ్చు కదా?` అంటూ పవన్ కు టేకిట్ ఈజీ రిప్లై ఇచ్చారు. ఇక బీజేపీ అయితే పొడిపొడిగానే స్పందించింది.
సరిగ్గా ఇలాంటి పరిస్థితే కొద్దికాలం క్రితం ఎదురైందని అంటున్నారు. టీఆర్ ఎస్ పార్టీ అధినేత - తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ అయిన ఎంపీ కవితను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. పార్లమెంట్ లో ఏపీకి మద్దతుగా మాట్లాడటం పట్ల హర్షం వ్యక్తం చేసిన పవన్ `చెల్లెలు కవితకు ధన్యవాదాలు` అని ట్వీట్ చేశారు. అయితే పవన్ ట్వీట్ కు కవిత ఏ మాత్రం స్పందించకపోవడం గమనార్హం. కనీసం ట్వీట్ లో కూడా రిప్లై ఇవ్వకపోవడం గమనార్హం. ఈ పరిణామాలు గమనిస్తే...పవన్ ఒకనాటి మిత్రపక్షాలు కానీ...ఇటీవల కలుస్తున్న మిత్రులు కానీ..ఆయన ప్రకటనలు - ప్రశంసలు - డెడ్ లైన్లు..సీరియస్ గా తీసుకోవడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.