Begin typing your search above and press return to search.
తట్టా..'బుట్టా' సర్దుకోవాల్సిందేనా!
By: Tupaki Desk | 6 Nov 2018 4:40 PM GMTతనకు రాజకీయ ఓనమాలు నేర్పించి ఎంపీని చేసిన వైసీపీని వీడినందుకు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తగిన మూల్యం చెల్లించుకోనున్నారా.. అనే ప్రశ్నకు ఎక్కువమంది నుంచి సరేననే సమాధానం లభిస్తోంది. చంద్రబాబు - రాహుల్ గాంధీ కలయిక ఈమెకు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. వివిధ అంశాలను బేరీజు వేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కర్నూలు ఎంపీ స్థానం నుంచి కాకుండా ఈసారి ఎన్నికల్లో ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని రేణుకకు సూచించడంతో ఆమె అలకబూని పార్టీ వీడారు. పోటీ చేస్తే ఎంపీగానే చేస్తానంటూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా టీడీపీ - కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే ఆమె ఆశలపై నీళ్లు పడ్డట్టే. కర్నూలు ఎంపీ టికెట్ కాంగ్రెస్ కు చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇచ్చేందుకే టీడీపీ మద్దతు పలికే అవకాశముంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీగా ఉండటమే కాకుండా ఎంపీగానే బరిలో ఉండాలని కలలు కంటున్న బుట్టా రేణుకకు సీటు గల్లంతైనట్టే. ఈపాటికే ఆమెకు టీడీపీలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ తో పాటు పాణ్యం ఇంచార్జి ఏరాసు ప్రతాప్ రెడ్డితో పొసగడం లేదు. దీంతో ఆమెకు ఈసారి ఎంపీ సీటు దక్కడం అనుమానంగానే కన్పిస్తోంది. చివరికి ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యే సీటు అయినా టీడీపీ నుంచి ఇస్తారో లేదో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బి.వి.జయనాగేశ్వరరెడ్డి టీడీపీకి చెందినవాడే. మాజీ మంత్రి బి.వి.మోహన్ రెడ్డి కుమారుడాయన. టీడీపీ హార్డ్ కోర్ ను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన బుట్టా రేణుకకు టికెట్ ఇస్తే కార్యకర్తలు భగ్గుమనే ప్రమాదం ఉంది. ఆమె భర్త టీడీపీకి చెందినవాడైనా సరే - సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టికెట్ ఇచ్చే సాహసం అధిష్టానం చేయజూస్తుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
పోనీ ఎమ్మెల్సీ లాంటి పదవినిచ్చే అవకాశం ఉందా అంటే .. టీడీపీ గెలవడమే గగనమైన సమయంలో ఇలాంటి హామీలను చంద్రబాబు ఇవ్వరని అందరికీ తెలుసు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొచ్చి వారినేం చేయాలో, వారికి ఎక్కడ సీట్లివ్వాలో తెలియక బాబు అయోమయంలో ఉన్నారు. పైగా కాంగ్రెస్ తో పొత్తు ఉంటే ఎన్నెన్ని తిప్పలు పడాలో - ఎవరెవరిని సముదాయించాలో ఆయన అర్థం కానిది కాదు. నిజానికి మంచి పార్లమెంటేరియన్ కాగలిగే లక్షణాలన్నీ బుట్టా రేణుకకు ఉన్నాయి. ఓ స్థాయి వరకు నిరూపించుకున్నారు కూడా. కానీ రకరకాల కారణాలతో పార్టీ సంక్షేమం దృష్ట్యా వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆమెకు ఉంది. ఆయన చెప్పినట్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో గెలిచినపుడు జగన్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి అయ్యే అవకాశం కూడా ఉండేది. కర్నూలు జిల్లాకు చెందిన శోభా నాగిరెడ్డి మరణం తర్వాత - వైసీపీకి ఓ మంచి మహిళా నాయకురాలి అవసరం జిల్లాకు ఉందనడంలో సందేహం లేదు. తొందరపడి బుట్టా రేణుక వైసీపీని వీడడంతో చివరకు రాజకీయాల నుంచి తట్టా బుట్టా సర్దుకునే ప్రమాదం ఏర్పడింది.