Begin typing your search above and press return to search.
నువ్వంటే.. నువ్వే.. టీడీపీ, జనసేన యుద్ధం..
By: Tupaki Desk | 24 May 2019 7:09 AM GMTఅత్త మీద కోపం దూత మీద చూపించడం అంటే ఇదే మరీ.. ఇప్పుడు గెలిచిన వైసీపీ హ్యాపీగా ఉంది. ఓడిన టీడీపీ , జనసేన కుమిలిపోతున్నాయి. కానీ ఎన్నికల వేళ మాత్రం ఇందుకు సీన్ రివర్స్ గా జరిగింది..
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జగన్ ను ఒంటరి చేసి చంద్రబాబు, పవన్ అనని మాట లేదు. కించపరిచని విధానం లేదు. జగన్ చిన్నాన్న హత్యను కూడా రాజకీయం చేసి వాడుకున్న విష సంస్కృతి బాబు, పవన్ లది అని వైసీపీ నేతలు ఆడిపోసుకున్నారు. కానీ నవ్విన నాప చేనే పండింది అన్నట్టుగా అవమానాల పాలైన జగనే ఈ ఎన్నికల్లో గెలిచాడు. అహంకారంతో అనరాని మాటలను అన్న వారిని జనం నామరూపాల్లేకుండా చేశారని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ఇప్పుడు వైసీపీ అఖండ విజయంతో టీడీపీ, జనసేనలకు పితలాటకం మొదలైంది. ప్రజాతీర్పుతో ఈ రెండు పార్టీలకు అందనంత ఎత్తులో వైసీపీ ఉండడంతో ఇప్పుడు ఆ పార్టీని ఏమీ అనరాని పరిస్థితి నెలకొంది. అందుకే టీడీపీ, జనసేనలు ఒకరినొకరు ఓటములకు మీరే బాధ్యులంతూ సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు.
టీడీపీ ఫ్యాన్స్ మాత్రం జనసేన వల్లే తాము ఓడిపోయామని..ఆడిపోసుకుంటున్నారు. తమ ఓట్లను చీల్చి వైసీపీ అఖండ మెజార్టీకి జనసేన కారణమని మండిపడుతున్నారు. ఇక జనసేన వెర్షన్ మరోలా ఉంది. మీకు చేత కాక.. జగన్ ను ఎదుర్కోలేక ఇలా పవన్ మీద పడి ఆడిపోస్తారా అంటూ జనసేన మద్దతు దారులు కౌంటర్ ఇస్తున్నారు.
ఐదున్నర శాతం ఓట్లు కూడా సాధించలేని జనసేన ఓ వైపు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన టీడీపీ మరోవైపు జగన్ ను, వైసీపీని అనలేక తమలో తాము దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తమ అసహనాన్ని వైసీపీ పై చూపలేక ఎన్నికల ముందు వరకు కలిసి సాగిన ఈ పార్టీలు ఇప్పుడు ఒకరినొకరు కలహించుకుంటున్నాయి.