Begin typing your search above and press return to search.
తిరుపతిలో ‘వ్యూహకర్త’ను దించిన బాబు.. ఢిల్లీకి పవన్
By: Tupaki Desk | 22 Dec 2020 11:08 AM GMTతిరుపతి లోక్ సభ ఫైట్ ఏపీలో కాకరేపుతోంది. అందరికంటే ముందే ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థిని ప్రకటించి అన్ని పార్టీలకు షాక్ ఇచ్చింది. నోటిఫికేషన్ రావడానికి ముందే ఓ వ్యూహకర్తను కూడా తిరుపతిలో రంగంలోకి దింపినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఏపీలో అధికారంలోకి రావటం కోసం చంద్రబాబు గతంలోనే ‘రాబిన్ శర్మ’ అనే వ్యూహకర్తతో ఒప్పందం చేసుకున్నారు. తాజాగా ఆయన తిరుపతిలో పర్యటించడం ఆసక్తి రేపుతోంది.
దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం ‘ఐప్యాక్’ సంస్థలో చాలా కాలం పనిచేసిన రాబిన్ శర్మ కొత్తగా ‘షోటైమ్ కన్సల్టింగ్’ అనే సంస్థను పెట్టుకున్నారు. దాని ద్వారా రాజకీయ పార్టీలకు అవసరమైన వ్యవహారాలను చక్కబెడుతున్నారు. దీనికోసం పెద్ద బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఇప్పుడు రాబిన్ శర్మ బృందం తిరుపతిలో మకాం వేసి ఏడు అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో టచ్ లోకి వెళ్లి పెద్ద తతంగమే నడుపుతోందని సమాచారం. వైసీపీ ప్రభుత్వంపై జనాభిప్రాయాన్ని సేకరిస్తోందట.. ఎన్నికల్లో టీడీపీ గెలుపుపై వ్యూహాలు అనుసరిస్తోందట.. ఇప్పుడు ఓడిపోతే ఇక టీడీపీ కి భారీ దెబ్బపడుతుందని చంద్రబాబు వరుసగా జూమ్ లో నేతలతో భేటి అవుతూ దిశానిర్ధేశం చేస్తున్నారట..
మరో వైపు తిరుపతి పంచాయితీ ఢిల్లీకి చేరింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతిచ్చామని తిరుపతి ఎంపీ సీటు తమకే ఇవ్వాలని జనసేనాని పవన్ కళ్యాన్ కోరుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ మాత్రం ఇక్కడ తామే పోటీచేయాలని గట్టి పట్టుదలతో ఉంది. ఉమ్మడి అభ్యర్థిని దించాలని చూస్తున్నారు.
ఈ క్రమంలోనే మరోసారి పవన్ ఢిల్లీ టూరు పెట్టుకున్నారు. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన పవన్ కు ఎదురుచూపులు దిక్కయ్యాయి. ఈ నెలాఖరుకు పవన్ మరోసారి ఢిల్లీ బాట పడుతున్నారు. ఎలాగైనా తిరుపతి ఎంపీ సీటు సాధించాలని పవన్ భావిస్తున్నట్టు తెలిసింది.
అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుపతి ఎంపీ సీటును జనసేనకు వదిలేలా కనిపించడం లేదు. మరి ఈ పొత్తు పొడుస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.