Begin typing your search above and press return to search.

లోకేష్ వి పిల్ల చేష్టలు.. పరిణితి చెందవా...?

By:  Tupaki Desk   |   20 May 2022 3:30 PM GMT
లోకేష్ వి పిల్ల చేష్టలు.. పరిణితి చెందవా...?
X
టీడీపీ భావి వారసుడు నారా లోకేష్. ఆయన విషయంలో టీడీపీ లో ఎలా ఉన్నా బయట అయితే చెప్పేది ఏంటి అంటే ఆయనవి పిల్ల చేష్టలు అనే. ఆయన పిల్ల చేష్టల వల్ల తండ్రి, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు తరచూ ఇబ్బందులు పడుతున్నారు అని కూడా అంటున్నారు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తరువాత చంద్రబాబు పరిపాలన తనదైన శైలిలో చేస్తూ ఉంటే అంతా బాగుంది. సాఫీగా సాగుతోంది అనే చెపుకునేవారు.

అయితే ఆ సమయంలో బాబు తన ఇంట్లో వాళ్ల నుంచి వచ్చిన వత్తిడి ఫలితంగానే లోకేష్ కి మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. ఇక అలా మంత్రి అయిన లోకేష్ అప్పటిదాకా చంద్రబాబు వెనక ఉంటూ ఆయనకు సలహాలు ఇచ్చే సీనియర్లను అందరికీ సైడ్ చేశారు. ఇక అంతా నేనే అని కూడా లోకేష్ నాడు చేసిన హడావుడి ఒక రేంజిలోనే సాగింది.

ఇక అది అలా ఉండగానే వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ లేకుండా చేయాలన్న ప్లాన్ వెనక చినబాబు ఉన్నారని చెబుతారు. ఇవన్నీ చంద్రబాబుకు ఎంతవరకూ ఇష్టమయ్యాయో తెలియదు కానీ లోకేష్ పిల్ల చేష్టల వల్ల, ఏ కోశానా పరిపక్వత లేని చినబాబు రాజకీయం వల్లనే 2019 ఎన్నికల్లో టీడీపీ దారుణంగా దెబ్బ తిని కేవలం 23 సీట్లకు పడిపోయింది అలా ఆ నంబర్ తో టీడీపీ ని అపోజిషన్ లో కూర్చోబెట్టారు ప్రజలు.

మరో వైపు చూస్తే ఏపీలోనే కాదు, తెలంగాణాలో కూడా వైఎస్సార్ మీద ఉన్న ప్రేమ జనాలలో ఇంకా చావలేదు. కానీ జగన్ వరకూ చూస్తే ఆ ప్రేమ మెల్లగా తగ్గుతూ వస్తోంది. ఇక ఒక లెక్కన చూస్తే వైఎస్సార్ మీద జనాల్లో ఉన్న ప్రేమ జగన్ని కాపాడుతూ వస్తోందని, కానీ తనదైన పోకడలు పోయి జగనే తన నాన్న మీద ఉన్న ప్రేమను తానే తగ్గిస్తున్నారు అని వైఎస్సార్ అభిమానులు మాత్రం ఆరోపిస్తున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబు తన ప్రసంగాలలో ఎక్కడా వైఎస్సార్ ని ఏమీ అనకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో జగన్ ఏమైనా వైఎస్సార్ కంటే గొప్పవాడా అని ఇండైరెక్ట్ గా వైఎస్సార్ ని పొగుడుతున్నారు కూడా. ఇది ఒక విధంగా వైఎస్సార్ అభిమానుల ఓట్లను వారి సానుభూతిని ఈసారి ఎన్నికల్లో టీడీపీకి గట్టిగానే సంపాదించే ప్రయత్నం బాబు చేస్తున్నారు.

ఇలా చంద్రబాబు బహుముఖ వ్యూహం వైసీపీ విషయంలో అనుసరిస్తూ ఉంటే లోకేష్ మాత్రం తన అపరిపక్వ రాజకీయంతో పిచ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్నారు అని అంటున్నారు. వైఎస్సార్ ని తిడుతూ నాన్న గారి రక్త చరిత్ర అంటూ లోకేష్ తాజాగా వేస్తున్న ట్వీట్లు చూసిన టీడీపీ వర్గాలు ఈయన చర్యల వల్ల ఉన్న ఓట్లు కూడా పోయేలా ఉన్నాయని కలవరపడుతున్నారు.

చంద్రబాబు చాలా లాజికల్ గా మాట్లాడుతూ కరడుకట్టిన వైఎస్సార్ ని పొగుడుటూ జగన్ని తిడుతున్నారు. మరి చినబాబు అయితే దానికి రివర్స్ గా ట్వీట్లు వేయడం వల్ల తండ్రి బాబు కష్టం పూర్తిగా పోతోంది అని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఇలా ఎప్పటికపుడు రాజకీయం తెలియకుండా లాజిక్కులు మిస్ అవుతూ చినబాబు చేస్తున్న పొలిటికల్ ఫీట్లు వేస్తున్న ట్వీట్లతో పార్టీ ఇబ్బందులలో పడుతోంది అని పార్టీ వర్గాలు అంటున్నాయి.

మొత్తానికి చూస్తే లోకేష్ కి రాజకీయంగా అవగాహన తక్కువని, ఆయనకు మెచ్యూరిటీ రాలేదని కూడా టీడీలో వర్గాలు అంటున్నారు. ఈ రకమైన పిల్ల చేష్టలతో లోకేష్ బాబు టీడీపీని ఇబ్బందుల్లో తానే స్వయంగా నెడుతున్నారు అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే లోకేష్ వైఖరి తో టీడీపీ వర్గాలకు కక్కలేక మింగలేక అన్నట్లుగా పరిస్థితి ఉందిట.