Begin typing your search above and press return to search.
అభిమానుల పిచ్చి పీక్స్ - ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలట
By: Tupaki Desk | 1 May 2019 10:31 AM GMT2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనే దానిపై రాష్ట్ర - జిల్లా స్థాయిల్లో బెట్టింగ్ లు ఊపందుకున్నాయి. కొంతమంది వేలల్లో కాస్తుంటే ఇంకొంతమంది మాత్రం లక్షల్లో పందేలు కాస్తున్నారు. ఇక కృష్ణా జిల్లాలో ఒక నేత అయితే.. దాదాపు రూ.2 కోట్లు పందెం కాశాడని పేపర్లో చదివాం. పందాలు విషయం కాసేపు పక్కనపెడితే.. ఈ పందాలను బేస్ చేసుకుని రాజకీయ అభిమానుల పిచ్చి పీక్స్ కు వెళ్లిపోయింది. మావాడు గెలుస్తాడు అంటే మావాడు గెలుస్తాడు అని చెప్పడమే కాదు.. ఫలానా రోజు ముహూర్తం, - ఆ రోజే ప్రమాణ స్వీకారం అంటూ ఊదరగొట్టేస్తున్నారు.
ఎన్నికలు అయిన రెండోరోజే జగన్ కు సంబంధించిన నేమ్ ప్లేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై టీడీపీ నేతలు కూడా విమర్శలు సంధించారు. ఇక రీసెంట్‌గా టీడీపీ అభిమానుల నుంచి మరో న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఈసారి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం పక్కా అని.. ఆయన మే 25న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రమాణ స్వీకారం చేసిన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగానే ఈసారి కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది వార్తలు వస్తున్నాయి. అక్కడ అయితేనే చంద్రబాబుకి బాగా కలిసి వస్తుందని.. ఈసారి కూడా రాష్ట్రం అద్భుతమైన రీతిలో అభివృద్ధి సాధిస్తుందని చెప్తున్నారు. అయితే.. వీటిని టీడీపీ అధికారికంగా దృవీకరించలేదు.
ఇక వైసీపీ అభిమానులు కూడా ఎక్కడా తగ్గడం లేదు. జగన్ కాబోయే ముఖ్యమంత్రి - ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా కన్ ఫర్మ్ అయ్యిందని చెప్పే ఒక పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ జ్యోతిష్యుడు రాసినట్లుగా ఉన్న ముహూర్తం పేపర్.. ఇప్పుడు జగన్ అభిమానులకు మాంచి కిక్ ఇస్తోంది. అయితే ఒకటి మాత్రం నిజం. ఇవన్నీ సోషల్ మీడియాలో హైప్ కోసమో - లేదంటే బెట్టింగ్ రాయుళ్ల కోసమో సృష్టించినవి తప్ప మరోకొటి కాదు. తమ పార్టీయే గెలుస్తుందని అత్యుత్సాహానికి పోయిన అభిమానులు ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. అసలు నాయకులు మాత్రం తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయోనని ఇప్పటికీ లెక్కలు వేసుకుంటున్నారు.