Begin typing your search above and press return to search.
ప్రత్తిపాటి ఇలాకాలో టీడీపీ వర్సెస్ వైకాపా!!
By: Tupaki Desk | 1 Nov 2016 9:53 AM GMTఏపీ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు - వైకాపా కార్యకర్తలు కుమ్మేసుకున్నారు. చిలకలూరిపేట మండలం, - కోమటినేనివారి పాలెంలో టీడీపీ - వైకాపా వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు రగులుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారు జామున ఇరు వర్గాలూ పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో 10 మంది గాయపడ్డారు. 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైకాపా తరఫున మర్రి రాజశేఖర్ పోటీ చేయగా, టీడీపీ తరఫున ప్రత్తిపాటి పోటీ చేసి గెలుపొందారు.
దీంతో అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగినట్టు సమాచారం. మరోపక్క, మంగళవారం నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ కార్యక్రమానికి మంత్రి పెద్ద ఎత్తున ఏర్పాట్టు చేసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ దాడి జరగడంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు వర్గాలను చెదరగొట్టాయి.
ఈ ఘర్షణలో గాయపడిన అంజయ్య - కుమార్ - శీను - వీరయ్య - యలమంద తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరిని చికిత్స నిమిత్తం నరసరావుపేట - చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ఇక, టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టనుండడంతో నియోజకవర్గంలో బందోబస్తు పెంచారు. అదేవిధంగా కోమటినేని వారిపాలెంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇంకా కేసులు నమోదు చేయలేదని సీఐ శోభన్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, గత పాత కక్షల కారణంగానే ఈ దాడులు జరిగాయన ఆయన వివరించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/