Begin typing your search above and press return to search.
గుడివాడలో టీడీపీ.. వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
By: Tupaki Desk | 11 April 2017 7:11 AM GMTకృష్ణా జిల్లా గుడివాడలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజాగా వెలువడిన గుడివాడ మున్సిపాలిటీ 19వ వార్డు ఉప ఎన్నిక ఫలితం రావటం.. అందులో అధికార టీడీపీ విజయం సాధించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబరు మరణించటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో అధికారపార్టీ నేతలు ఓటర్లు ఒక్కొక్కరికి ఓటుకు రూ.7వేల వరకూ పంచినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి భారీగా వార్తలు మీడియాలో వచ్చాయి. దీనికి తగ్గట్లే తాజా ఫలితం అధికార టీడీపీకి అనుకూలంగా రావటం గమనార్హం. ఓటుకు రూ.7వేలు చొప్పున పంచిన టీడీపీ తమ్ముళ్లు విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం టీడీపీ అభ్యర్థి 150 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
దీంతో.. టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. జగన్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నానికి పట్టున్న ప్రాంతంలో జరిగిన ఎన్నికలో అధికారపార్టీ అధికార దుర్వినియోగంతో పాటు.. పెద్ద ఎత్తున డబ్బును ఖర్చు చేయటంతో ఇలాంటి ఫలితం వచ్చిందన్న మాటను జగన్ పార్టీ నేతలు పలువురు చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులుఖర్చు పెట్టి.. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం.. జగన్ పార్టీ నేతల్ని కవ్వించే చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
విజయోత్సవ ర్యాలీ పేరుతో జగన్ పార్టీకి చెందిన వారిని కవ్వించేలా టీడీపీ తమ్ముళ్లు వ్యవహరించటం.. దీంతో మొదలైన వివాదం అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. ఇరు వర్గాలు దాడుల వరకూ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
ఏపీలోని వివిధ మున్సిపాలిటీల్లో పలు వార్డులకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఆ వివరాల్ని చూస్తే..
- కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ 19 వార్డు : టీడీపీ
- చిత్తూరు 38వ డివిజన్ : టీడీపీ
- ఎలమంచలి మున్సిపాలిటీ 16వ వార్డు : టీడీపీ
- మాచర్ల 15వ వార్డు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీలో మూడు వార్డులు: టీడీపీ
- హిందూపురం 9వార్డు: టీడీపీ
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/