Begin typing your search above and press return to search.
మన కులం నేతలంతా కాకినాడ వెళ్లండి
By: Tupaki Desk | 25 Aug 2017 5:24 AM GMTసార్వత్రిక ఎన్నికల జరిగిన మూడేళ్ల వరకు దాదాపుగా ఎలాంటి ఎన్నికల సందడి లేని ఏపీలో ఇప్పుడు వరుస ఎన్నికల కోలాహలం నెలకొంది. ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నిక పేరుకే ఉప ఎన్నిక అయినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల రేంజ్ లో అధికార - ప్రతిపక్ష నాయకుల పోరాటం సాగింది. ఇది ముగిసిన వెంటనే తెలుగుదేశం - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. కీలక ఎన్నికలు ఏవైనా పార్టీ సీనియర్లను రంగంలోకి దింపి వాటిని పర్యవేక్షించడం సహజం. అయితే కాకినాడలో దీనికి భిన్నంగా కులాల లెక్కన లీడర్లను ఫీల్డ్ లో దించుతున్నారని అంటున్నారు.
సుదీర్ఘకాలం తర్వాత జరగనున్న కాకినాడ కార్పొరేషన్ లో రెండు మినహా మిగిలిన 48 వార్డులకు ఈనెల 29న ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేషన్ పరిధిలో 2లక్షల 80 వేల మంది ఓటర్లున్నారు. వీరిని ఆకట్టుకునేందుకు అచ్చంగా సంకుల సమరం జరుగుతోందని అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా కులాల మంత్రులు - నేతలను ప్రధాన పార్టీలు రంగంలోకి దించాయని తెలుస్తోంది. ఏ డివిజన్ లో ఏ కులం ఓట్లు అధిక సంఖ్యలో ఉంటే ఆ డివిజన్ లో ప్రచారానికి ఆ కులానికి చెందిన నేతలను ప్రయోగిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు పూర్తిగా కులం రంగు పులుముకున్నాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతలు - మంత్రులు నగరంలోనే ఉండి, తమ కుల ప్రాబల్యం అధికంగా ఉన్నచోట్ల ప్రచారం నిర్వహిస్తున్నారు. పోటీలో ఉన్న వార్డుల వివరాలు చూస్తే....నగరంలో కాపు సామాజికవర్గంతో పాటు మత్స్యకార - ఎస్సీ కులాల ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. నగరంలోని 13 డివిజన్లలో దాదాపు టీడీపీ - వైసీపీ నుండి కాపు సామాజికవర్గ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మత్స్యకారులు నగరంలోని 9 డివిజన్లలో అధికంగా ఉన్నారు. ఎస్సీ సామాజికవర్గం నగరంలోని 5 డివిజన్లలో ఎక్కువగా ఉంది. అలాగే కొన్ని డివిజన్లలో బ్రాహ్మణ - వైశ్య సామాజికవర్గాలు అధికంగా ఉన్నాయి. యాదవ - శెట్టిబలిజ - రజక సామాజికవర్గాల ప్రభావం కూడా కొన్ని డివిజన్లలో ఉంది.
కులాల లెక్కలను పసిగట్టి ప్రణాళిక గీయడంతో ముందుండే అధికార తెలుగుదేశం పార్టీ ఈనేపథ్యంలో డివిజన్ల వారీగా సామాజికవర్గాలను పరిగణలో ఉంచుకుని తెలుగుదేశం రాష్టస్థ్రాయి నేతలు రంగంలోకి దించింది. కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్ప - కిమిడి కళావెంకట్రావు - ఎంపీలు అవంతి శ్రీనివాస్ - తోట నరసింహం - ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు తదితరులు కాపులు అధికంగా ఉన్న డివిజన్లలో దగ్గరుండి అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. మత్స్యకార డివిజన్లకు సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర- కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. ఎస్సీలను ఆకట్టుకునేందుకు మంత్రి కెఎస్ జవహార్ - ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకరరావు - హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన వర్ల రామయ్య తదితరులు ప్రచారం చేశారు. శెట్టి బలిజ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు పితాని సత్యనారాయణ - వెలమ సామాజికవర్గం కోసం చింతకాయల అయ్యన్నపాత్రుడు - కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రచారం చేశారు. యాదవ సామాజికవర్గానికి జిల్లాకు చెందిన మంత్రి యనమల రామకృష్ణుడు పెద్ద దిక్కుగా ఉండటంతో ఆ కులం సైతం టిడిపికే అనుకూలంగా ఉంటుందన్న సంకేతాలను ఆ పార్టీ నేతలిస్తున్నారు. ఇంకా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్ ఆనంద సూర్య - కమ్మ సామాజికవర్గం నుండి ప్రత్తిపాటి పుల్లారావు ఆయా డివిజన్లలో ప్రచారం చేశారు. బీజేపీకి సంబంధించి కాపు సామాజికవర్గానికి చెందిన పైడికొండల మాణిక్యాలరావు - సోము వీర్రాజు - క్షత్రియ సామాజికవర్గానికి చెందిన పెనుమత్స విష్ణుకుమార్ రాజు తదితరులు ప్రచారం చేస్తున్నారు.
అధికార పార్టీ కులరాజకీయాల లెక్కలను గమనించిన ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ కూడా తెలుగుదేశం బాటలోనే కులాల వారీగా నేతలను రంగంలోకి దింపింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్థానికంగా ఉండి ఎన్నికల ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన బొత్స సత్యనారాయణ - అంబటి రాంబాబు - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు - మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ - ఎస్సీ సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున - పార్టీ సీనియర్ నేత పినిపే విశ్వరూప్ - శెట్టి బలిజ కులానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ - వెలమ సామాజికవర్గం నుండి ధర్మాన ప్రసాదరావు - రెడ్డి సామాజికవర్గం నుండి చెవిరెడ్డి భాస్కరరెడ్డి - యాదవ సామాజికవర్గం నుండి కె పార్ధసారధి - బ్రాహ్మణ సామాజివర్గం తరపున మల్లాది విష్ణు - కోన రఘుపతి - కమ్మ సామాజికవర్గం నుండి ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వంటి నేతలు తమ తమ సామాజికవర్గాలు అధికంగా ఉన్న చోట అభ్యర్థులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించడం గమనార్హం. మొత్తంగా సొంత కులస్థులను ఆకట్టుకునే క్రమంలో ఆయా పార్టీల నేతలు బిజీబిజీగా మారిపోయారని అంటున్నారు.