Begin typing your search above and press return to search.
ఇది పేదలను కొట్టి కట్టిన టీడీపీ ఆఫీస్ కబ్జా కథ..
By: Tupaki Desk | 29 Oct 2019 8:33 AM GMTఅది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ రెవెన్యూ పరిధి. చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం ఖరీదు రూ.70కోట్ల పైమాటే.. షేక్ బాజీ అనే పేదకు చెందిన 3.50 ఎకరాల భూమి అది. 1993లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిపై ఆధారపడే షేక్ బాజీ జీవిస్తున్నాడు.
అయితే ఈ భూమి హక్కుదారు షేక్ బాజీ 2014లో మరణించాడు. దీంతో ఈ విలువైన భూమిపై టీడీపీ నేతల కన్నుపడింది. చంద్రబాబు గద్దెనెక్కాక ఇక్కడ మంగళగిరి పక్కనే అమరావతి రాజధాని ప్రకటన చేయడంతో ఈ భూమి ఖరీదైనదిగా మారిపోయింది. కోట్లకు పడగలెత్తింది. దీంతో ఈ విలువైన భూమిని కాజేయాలని టీడీపీ బ్యాచ్ స్కెచ్ గీసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
తన తండ్రి షేక్ బాజీ మరణానంతరం తమ పేరిట ఈ భూమిని బదలాయించాలని ఆయన కుమారుడు షేక్ సూఫీబాబా మంగళగిరి రెవెన్యూ అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు. కానీ టీడీపీ నేతలు దీన్ని అడ్డుకున్నారని సూఫీబాబా ఆరోపించాడు. దీనిపై సూఫీబాబా హైకోర్టును ఆశ్రయించాడు. నిజమైన హక్కుదారుడైన సూఫీబాబా పేరిట భూమిని బదలాయించాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ నేతలు చక్రం తిప్పారు. ఏకంగా హైకోర్టునే తప్పుదోవ పట్టించారు. ఈ భూమి నిజమైన హక్కుదారుడు జొన్నాదుల సాంబశివరావు అంటూ తప్పుడు సమాచారం అధికారుల ద్వారా కోర్టుకు సమర్పించారని బాధితులు ఆరోపించారు. దీంతో కోర్టు ఈ స్థల వివాదంపై ఎటూ తేల్చకుండా స్టే ఇచ్చింది. విచారణ కొనసాగుతుండగానే సూఫీబాబా ఆ భూమిలో వేసుకున్న కందిపంటను అధికారులు ధ్వంసం చేసి భూమిని చదును చేసేశారు.
అయితే కోర్టులో వివాదంగా ఉన్న స్థలాన్ని నాటి చంద్రబాబు ప్రభుత్వం ఇవేవీ పట్టించుకోకుండా 99 ఏళ్లకు 1000 నామమాత్రపు రుసుంతో తెలుగుదేశం పార్టీకి లీజుకు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ అధిష్టానం ఇక్కడ శంకుస్థాపన చేసి టీడీపీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తోంది. బాధితులు హైకోర్టు కెక్కి న్యాయం కోసం చకోర పక్షిలా తిరుగుతున్నారు. ఇప్పుడు కోర్టులో వివాదం ఉండగానే టీడీపీ కార్యాలయం ఆ స్థలంలో పూర్తి అయిపోయింది. 70 కోట్ల స్థలాన్ని అప్పనంగా 1000కే కొల్లగొట్టిన టీడీపీ కబ్జా కథపై బాధితులు నెత్తినోరు బాదుకుంటున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. .