Begin typing your search above and press return to search.
టీడీపీ గొంతెమ్మ కోరిక.. జగన్ తీర్చాలట..
By: Tupaki Desk | 13 Jun 2019 6:56 AM GMTటీడీపీ గొంతెమ్మ కోరికలు కోరుతోంది. ఆ కోరికలను జగన్ ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేస్తోంది.. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనే తరహాలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధికార వైసీపీకి తాము గతంలో అమలు చేసిన పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా కనిపిస్తోంది.
అయిదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు హామీలిచ్చి మోసం చేశారు చంద్రబాబు. తీరా ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు పసుపు కుంకుమ, రుణమాఫీ అంటూ హామీల వర్షం కురిపించి ప్రజలకు లబ్ధి చేకూర్చారు. కానీ ఐదేళ్లు ఏమీ చేయకుండా చివర్లో మోసం చేయడానికి టీడీపీ ఇచ్చిన లబ్ధిని జనం చీకొట్టారు. ప్రతిపక్ష వైసీపీకే పట్టం కట్టారు..
అయితే ఓడిన పార్టీ ఓడినట్టు ఉండాలి. కానీ తాము ఐదేళ్లలో అమలు చేయని.. చివర్లో అమలు చేసిన పథకాలను వైసీపీ అమలు చేయాలని డిమాండ్ చేయడమే విడ్డూరం. రుణమాఫీ, సహా పసుపు కుంకుమ తదితర పథకాలను జగన్ ప్రభుత్వం హామీ చేయాలని తాజాగా చంద్రబాబు, యనమల రామకృష్ణుడు డిమాండ్ చేయడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుత ప్రభుత్వం.. గడిచిన ప్రభుత్వంలోని ఎన్నో విలువైన పథకాలను అమలు చేయడం కనీస బాధ్యత అని యనమల సన్నాయి నొక్కులు నొక్కడం విశేషం.
ఇలా చంద్రబాబు ఆడలేక మద్దెల ఓడు అని తమ పథకాలను వైసీపీ అమలు చేయాలంటున్నారు. కానీ జగన్ మాత్రం ప్రజలకు ఇచ్చిన నవరత్నాలను అమలు చేయాడానికి రెడీ అయ్యారు. ఇలా తొలినుంచే జగన్ అడుగులు అటు పడగా.. చంద్రబాబు మాత్రం చివర్లో అమలు చేసి ఇప్పుడు జగన్ ఫాలో కావాలని అనడం విస్తుగొలుపుతోంది.