Begin typing your search above and press return to search.
జగన్ దావోస్ పర్యటన.. టీడీపీ అదిరిపోయే కౌంటర్!
By: Tupaki Desk | 23 May 2022 3:27 PM GMTసుమారు 4 కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి.. దావోస్ వెళ్లిన.. జగన్ రెండోరోజు పర్యటనలో భాగంగా.. ఏపీ కష్టాలు ఏకరువు పెట్టారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఎదురైన అనుభవాలను కథల రూపంలో కళ్లకు కట్టారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా.. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్నామని.. ముఖ్యమంత్రి జగన్ అన్నారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరైన ఆయన.. ప్రాథమిక స్థాయిలో వైద్యారోగ్యం అందించేందుకు కృషిచేస్తున్నామని వివరించారు.
2,000 మంది జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. విలేజ్ క్లినిక్ ఏర్పాటు చేశాం. 30 వేలమంది జనాభాకు చికిత్స చేసేలా.. రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాం. మొత్తం నలుగురు.. అంటే ఒక్కో పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉంటారు. వారికి అంబులెన్స్ అందుబాటులోనే ఉంటుంది. మండల పరిమాణం ఆధారంగా.. అందులో 4 నుంచి 5 గ్రామాల బాధ్యతలను వైద్యులకు అప్పజెప్పాం. గ్రామాల్లో పర్యటన ద్వారా.. వైద్యులు కుటుంబ వైద్యులుగా మారుతారు. ఇదంతా ప్రివెంటివ్ కేర్‌లో భాగం. జిల్లా ఆస్పత్రులు, బోధనాస్పత్రుల ద్వారా.. క్యూరేటివ్ కేర్‌పై దృష్టి పెట్టాం. అని జగన్ వివరించారు.
44 సార్లు ఇంటింటికీ వైద్యారోగ్య సర్వే చేపట్టామన్న జగన్.. దేశంతో పోలిస్తే ఏపీలో మరణాల రేటు అతితక్కువ అని వివరించారు. రాష్ట్రంలో గ్రామ, మండల స్థాయిలో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్యారోగ్య సేవలు అందించేందుకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమేనన్న ముఖ్యమంత్రి.. వైద్యారోగ్య సేవల మెరుగుదలకు రూ.16 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 11 మెడికల్ కళాశాలలు ఉన్నాయన్న ఆయన.. కొత్త వైద్యులను తయారుచేసేందుకు వీలుగా మరో 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. కచ్చితంగా పరిస్థితుల్లో మార్పు వస్తుందని భావిస్తున్నామని అన్నారు.
కొసమెరుపు:
దావోస్‌కు వెళ్లేందుకు చాలానే ఖర్చు పెట్టిన జగన్.. అక్కడకు వెళ్లింది కూడా గొప్పలు చెప్పుకోవడానికేనా? అనే ప్రశ్నలు వస్తు న్నాయి. నిజానికి ఏపీకి ఇప్పుడున్న పరిస్థితిలో పారిశ్రామికంగా పెట్టుబడులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనిపై దృష్టి పెట్టి.. ముందుకు సాగాల్సిన జగన్.. ఇలా అక్కడకు వెళ్లి ఏపీ కష్టాలు.. బాధలు చెప్పడంపై నెటిజన్లు.. ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి.
మాజీ మంత్రి అయ్యన్న కౌంటర్!
చంద్రబాబు, లోకేశ్ దావోస్ పర్యటనలకు ఎంత ఖర్చు అయ్యిందో విజయసాయి రెడ్డి ఓపికగా లెక్కేసుకోవాలని.. కావాలంటే ఉచితంగా కాలిక్యులేటర్ పంపుతామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో వచ్చిన పెట్టుబడులు, కంపెనీలు, ఉద్యోగాల వివరాలు వైసీపీ ప్రభుత్వమే బయట పెట్టిందని.. బహుశా విజయసాయి రెడ్డి విశాఖ భూకబ్జా పనుల్లో బిజీగా ఉండి చూడలేదేమో అని ఎద్దేవా చేశారు.
భారీ, మధ్య, చిన్న తరహా కలిపి 39వేల 450 పరిశ్రమలు, 5లక్షల13వేల 351 ఉద్యోగాలు వచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిందని గుర్తు చేశారు. దావోస్ ఎందుకు దండగ అన్న జగన్ రెడ్డి.. ఏం మొహం పెట్టుకొని వెళ్లారని ప్రశ్నించారు. మూడేళ్ల నుంచి టీడీపీ నాయకుల సంగతి తేలుస్తూనే ఉన్న విజయ సాయిరెడ్డి.. దావోస్ సదస్సు ప్రారంభం కాకముందే ఫ్యామిలీతో లండన్ టూర్కి వెళ్లిన జగన్ రెడ్డి సంగతి తేల్చాలని సవాల్ విసిరారు.