Begin typing your search above and press return to search.
బాబు కంటే సీనియర్....హెడ్ మాస్టర్ లా క్లాస్...?
By: Tupaki Desk | 20 Nov 2022 11:30 AM GMTఆయన టీడీపీ రాజకీయాల్లో చంద్రబాబు కంటే సీనియర్. ఆ విషయం చాలా సార్లు ఆయనే బయటకు చెప్పుకున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ లో ఉండగా అయ్యన్నపాత్రుడు 1982లోనే టీడీపీలో చేరి 1983 ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు. అది లగాయితూ టీడీపీలో సీనియర్ లీడర్లతో పాటు ఆయన కూడా ఒకరిగా నిలిచారు.
టీడీపీలో అనేక మంది సీనియర్ నేతలు ఉన్నా కూడా అయ్యన్నపాత్రుడు మాదిరిగా ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడేవారు బహు తక్కువ. అందునా చంద్రబాబు ఎదుట నిలిచి సార్ మీరు ఇది తప్పు చేస్తున్నారు అని చెప్పే ధైర్యం అయితే ఎవరికీ లేదు. అది ఒక్క అయ్యన్నకే సాధ్యం. అందుకే ఆయన మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో కుండబద్ధలు కొట్టారు.
సార్ మీరు ఇంక నాన్చవద్దూ, క్యాండిడేట్లను వెంటనే ప్రకటించండి, ఎవరు గెలుస్తారో అంచనా వేయండి, పని మంతులకే టికెట్లు ఇవ్వండి, ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలూ వద్దు, రాజీలు అంతకంటే వద్దు. గెలవను అనుకుంటే నాకు కూడా టికెట్ ఇవ్వవద్దు అంటూ అయ్యన్న చెప్పడంతో షాక్ తినడం బాబు వంతు అయింది అంటున్నారు.
ఇక పార్టీ టికెట్ల పంపిణీ విషయంలో ముందుగానే అభ్యర్ధులను గుర్తించి ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని అయ్యన్న చెప్పుకొచ్చారు. ఈ విషయంలో అలసత్వం తగదని హితోక్తులు పలికారు. ప్రజలలో పార్టీని గెలిపించాలన్న కోరిక ఉందని, అధినాయకత్వం కూల్ గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అయ్యన్న కోరారు.
ఇక మరో కీలక సూచన కూడా అయ్యన్నపాత్రుడు చేశారట. 2019 ఎన్నికల ఫలితాలు ఒక పీడకల. వాటి విషయం తరచూ చర్చించడం కంటే మరచిపోవడం మంచిదని కూడా ఆయన పేర్కొన్నారని న్నారు. టీడీపీని గెలిపించడానికి పార్టీ నాయకులు క్యాడర్ అంతా కీలకమైన బాధ్యతలు తీసుకుని ముందుకు అడుగులు వేయాలని కోరారు.
గతంలో ప్రతీ మూడు జిల్లాలకు ఒక ఇంచార్జిని నియమించినట్లుగా ప్రస్తుతం నియమించాలని అయ్యన్న సూచించారని అంటున్నారు. అలాగే పార్టీలో ఎంత టాప్ లీడర్ అయినా టికెట్ రావాలంటే కష్టపడి పనిచేయాల్సిందే అని ఆ విషయంలో అధికనాయకత్వం కూడా ఒక కంట కనిపెట్టాలని కోరారు.
పార్టీ గెలుపు కోసం పొత్తులు కూడా అవసరమే అని అవి వ్యూహాత్మకమని, టీడీపీకి సొంతంగా గెలిచే సత్తా ఉన్నా కూడా ఉడతాసాయంగా ఇతర పార్టీల మద్దతు తీసుకోవడంలో తప్పు లేదు అని అయ్యన్న అంటున్నారు. నిజంగా టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేదు, ఆ పార్టీకి సత్తా లేదు అని వైసీపీ అంటున్నా చంద్రబాబు ఇంత ధీటుగా జవాబు చెప్పలేదు. కానీ ఇపుడు అయ్యన్న మాత్రం దీనికి సరైన ఆన్సర్ చెప్పారనే అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీకి ఏమి చేస్తే గెలుస్తుంది అన్నది సీనియర్ నేతగా అయ్యన్న ఒక క్లాస్ తీసుకున్నారని అంటున్నారు. మరి ఈ క్లాస్ విని అయినా బాబు మారుతారా. ఏమో చూడాలి.