Begin typing your search above and press return to search.
బాబుగారు శ్రీరాముడు...విభీషణుడు వైసీపీలో ఎవరు...?
By: Tupaki Desk | 20 Nov 2022 3:33 PM GMTచంద్రబాబు సమర్ధుడైన నాయకుడు అని తమ్ముళ్ళు దశాబ్దాలుగా చెబుతూ వస్తున్నారు. ఈసారి కాస్తా అతిశయంతో ఆయన ఇమేజ్ ని మరింతగా పెంచాలనుకున్నారేమో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏకంగా శ్రీ రామచంద్రుడు మా తెలుగుదేశం చంద్రుడు అంటూ గొప్ప పోలిక పెట్టారు. ఆనడు రావణ వధ కోసం శ్రీరాముడు అందరినీ కలుపుకుని పోయినట్లుగా చంద్రబాబు కూడా ఏపీలో రావణ పాలన మీద పోరాటం చేస్తున్నారు అని కూడా చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో రాముడు విభీషణుడు, ఉడత వానరుల సాయం తీసుకున్నట్లుగానే అందరి సాయం తీసుకుంటున్నారని, ఇందులో తప్పు లేదని అయ్యన్న చెప్పుకోచ్చారు. నాటి శ్రీరాముడి మాదిరిగా ఒక్క బాణమేసి వైసీపీ సర్కార్ ని కూలదోసే బలం టీడీపీకి ఉన్నా కూడా బాబు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు అని కూడా విషయం ఎంచక్కా విడమరచి చెప్పారు.
సరే అయ్యన్నపాత్రుడికి వారి నాయకుడిలో శ్రీరాముడు కనిపించడం వరకూ బాగానే ఉంటుంది. పోలిక కూడా ఆయనకు ఏమీ సమస్య కాదు. కానీ అదే రాముడి పార్టీ దేముడి పార్టీ అని చెప్పుకునే బీజేపీకి మాత్రం ఈ పోలిక ఎందుకో మండినట్లుగా ఉందిట. అందుకే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు సీన్ లోకి వచ్చేశారు.
రాముడితో పోలిక ఏంటి అంటూ ఆయన ఫైర్ అయ్యారు. అయినా లోక కళ్యాణమా పాడా లోకేష్ కళ్యాణం కోసం అని చెప్పరాదూ అంటూ టీడీపీ మీద విరుచుకుపడ్డారు. మీరు ఏపీ కోసం కాదు సొంత రాజకీయాల కోసమే అంటూ విసుర్లు విసిరారు. రాముడుగా చంద్రబాబుని అంటే మేముప్పుకోమని బీజేపీ వారు అంటున్నారు.
అవును బేజేపీ వారికి రాముడే దిక్కు. అయిన వారు తమలో ఏ నాయకుడినీ రాముడితో పోల్చి జనంలో పెట్టలేదు. కానీ టీడీపీ ఫైర్ బ్రాండ్ అయ్యన్న ఈ పోలిక తెచ్చేశారు. దాంతో తమ పేటెంట్ హక్కులకు ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని జీవీఎల్ ఇలా ఎంట్రీ ఇచ్చారని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అయ్యన్నపాత్రుడు చెబుతున్న మిగిలిన వాటిలో పోలికలు కూడా చూసి నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నరు.
ఉడతా సాయం అంటున్నారు. ఇంతకీ మిగిలిన విపక్ష పార్టీలలో ఉడత ఎవరు అది కూడా చెప్పరాదే అయ్యన్నా అని అడుగుతున్నారు. అలాగే వానరులు ఎవరో కూడా కాస్తా సెలవీయండి బాబూ అని సెటైర్లు వేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యం విభీషణుడు. అంటే లంక గుట్టుని తెచ్చి రాముడి చెవిలో వేసిన వారు.
అంటే కచ్చితంగా వైసీపీ నుంచి అలాంటి కోవర్టులు టీడీపీకి విభీషణ సాయం చేసేందుకు ఉన్నారా లేక ఉండబోతున్నారా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే రాముడుగా బాబుని టీడీపీ వారు చెప్పుకుని ఒప్పుకుంటే రావణుడుగా జగన్ ఎలా ఉంటాడు, ఆయనని విలన్ గా ఎలా చూపిస్తారు అని వైసీపీ నేతలు మండుతున్నారు.
అనేక సంక్షేమ పధకాలు ఏపీలో చేసి సుభిక్షమైన పాలన సాగిస్తున్న జగన్ రాముడని, రావణుడు బాబే అని వారు రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇదంతా తెలుగుదేశం వారి రామాయణమని, అయ్యనన్ పుక్కిట పురాణమని మండుతున్నారు.
మొత్తానికి శ్రీరామచంద్రుల వారికి ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా అని ఆస్థిక జనులు అనుకోవాల్సిందే. ఎందుకంటే రాముడు మా నాయకుడు అంటే మా నాయకుడు అని నేతలు పోటీగా చెప్పుకుంటున్న వేళ ఆస్థిక జనుల ఆరాధ్య దైవం రాముల వారి పేరు పోలిక చూసి అయ్యో రామా అని అనుకోవాల్సిందే అంటున్నారుట.