Begin typing your search above and press return to search.
ప్రెస్ మీట్ లో ఒక్క తమ్ముడిలోనూ కనిపించని పసుపు
By: Tupaki Desk | 20 Oct 2021 3:36 AM GMTసాధారణంగా ఒక రాజకీయ పార్టీ ప్రెస్ మీట్ జరుగుతుంటే.. ఆ పార్టీకి సంబంధించిన కండువా కానీ.. ఆపార్టీ రంగుకు తగ్గ వస్త్రాలు ధరించటం కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన సందర్భాలు ఎలా ఉన్నా.. కొన్ని కీలకమైన సమయాల్లో అలాంటివి చాలా చాలా ముఖ్యం. కానీ.. తాజాగా నిర్వహించిన కీలక మీడియా సమావేశంలో తెలుగు తమ్ముళ్ల తీరు చూస్తే.. నోట మాట రాని విధంగా ఉంది.
మంగళవారం చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు.. ఏపీలోని పలు ప్రాంతాల్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడి జరగటం.. చివరకు పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా దాడి జరిగిన తీరు చూస్తే.. ఇలాంటి పరిస్థితా? అని షాక్ కు గురి కాకుండా ఉండలేం. రాజకీయం అన్నాక చాలానే ఉంటాయి. ఎన్ని ఉన్నా.. హద్దులు దాటకూడదు. ఎంత బలమున్నా అందరూ ఆమోదయోగ్యమైన రీతిలో ఉండాలే తప్పించి.. వేలెత్తి చూపించేలా ఉండకూడదు.
తమ తరఫు వాదనను ఎంత బలంగా వినిపించినా.. సీసీ కెమేరాల ఫుటేజ్ తో పాటు.. జరుగుతున్న దాడికి సంబంధించిన లైవ్ అప్డేట్స్ టీవీల్లో చూసిన ప్రజలకు ఎవరేం చేశారన్నది తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ పార్టీ ప్రధాన కార్యాలయం మొదలు ఏపీ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పార్టీ ఆఫీసులపై జరిగిన దాడిని ఖండిస్తూ చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు.
ఎప్పటిలానే ఆయన తనదైన మార్కు పసుపు రంగుతో ఉండే చొక్కా ధరించారు. కానీ.. ప్రెస్ మీట్లో పాల్గొన్న మిగిలిన నేతలు ఎవరూ కూడా.. పసుపు రంగుతో కూడినచొక్కా వేసుకోలేదు. చివరకు మెడలో పార్టీ కండువా కూడా వేసుకోకపోవటం గమనార్హం కీలకమైన పార్టీ ప్రెస్ మీట్ సందర్భంగా తమ పార్టీకి సంబంధించిన ఏదో ఒక దానిని ధరించి ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. బాబుతో పాటు అరడజను మంత్రి సీనియర్ నేతలు కూర్చున్నా.. వారిలో ఏ ఒక్కరు పార్టీ కండువాను సైతం మెడలో వేసుకోకపోవటం బాగోలేదన్న మాట వినిపిస్తోంది.